ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో బండాయి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని ఫిర్జోపూర్ నుంచి మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్న పటల్‌కోట్ అనే ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 3.45 PM గంటలకు ముందుగా రెండు బోగీలకు మంటలు అంటుకోవడంతో.. అవి మరింత వ్యాపించకుండా రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.
వెంటనే మిగతా బోగీలను వాటి నుంచి విడదీశారు. సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఆగ్రా జోన్ రైల్వే అధికారి శ్రీవాస్తవ తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: వైద్యుల నిర్లక్ష్యం.. 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటీస్ వ్యాధులు..