Andhra Pradesh: విశాఖపట్నం బీజేపీ ఎంపీ సీటు దక్కేదెవరికో..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఎంపీ సీటు కోసం బీజేపీ అభ్యర్ధుల మీద తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలని పురందేశ్వరి, జివిఎల్ నరసింహారావు ఇద్దరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

New Update
Andhra Pradesh: విశాఖపట్నం బీజేపీ ఎంపీ సీటు దక్కేదెవరికో..

Vishakha BJP MP Seat: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విశాఖ ఎంపీ సీటు హాట్ సీట్‌గా మారింది. నిన్న సాయంత్రం ఆంధ్రాలో బీజేపీ అభ్యర్ధుల జాబితాను ప్రకటింస్తుందని పార్టీ శ్రేషులు చెప్పారు. కానీ సీనియర్లు ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో పంచాయితీ పెట్టడంతో అది ఆగిపోయింది. పార్టీలో బయటి నుంచి వచ్చినవాళ్ళను కాకుండా మొదటి నుంచి కష్టపడుతున్న వాళ్లనే పరిగణనలోకి తీసుకోవాలని సీనియర్లు ఢిల్లీ పెద్దలను అడుగుతున్నారు. మరో రెండు రోజు వరకు అభ్యర్ధుల ప్రకటన ఉండదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి, జీవీఎల్ నరసింహం.

మాదంటే మాదంటున్నారు..
విశాఖ సీటు తనదే అంటున్నారు జీవీఎల్ నరసింహారావు. మూడేళ్లకు పైగా విశాఖలో పనిచేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆయనది వైజాగ్ కాకపోయినా తన స్టాండ్ ను నిలుపుకునేందుకు అడపా దడపా వైజాగ్ వచ్చి పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ తన ఉనికిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఎంపీ సీటు కోసం పోటీ చేసి గెలుపొంది లోక్ సభ మెంబర్ గ పార్లమెంట్లో కూర్చునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు పురంధరేశ్వరి కూడా ఈ సీటు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆమె ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి, విజయం సాధించారు. ఈ సీటుతోనే కేంద్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎలక్షన్లలో ఒకసారి వైజాగ్ నుంచి, మరొకసారి రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ సీనియర్ నాయకులు అనే హోదాతో పురందేశ్వరి వైజాగ్ సీటుపై ఆశలు పెంచుకున్నారు.

ఇద్దరిలో ఎవరికి సీటు..
అయితే ఇద్దరిలో విశాఖ ఎంపీ సీటు ఎవరికి ఇస్తారనే దాని మీద బీజేపీ అధిష్టానం మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. మరో రెండు రోజుల్లో అభ్యర్ధులను ప్రకటిస్తారని...అప్పుడే ఈ ఎంపీ సీటును కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read:PM Modi: తెలుగు స్పీచ్ తో అదరగొడుతున్న మోదీ.. టెక్నాలజీని ఇలా ఫుల్లుగా వాడేస్తున్న బీజేపీ!

Advertisment
తాజా కథనాలు