Twins Reunite After 19 Years : ఇద్దరు కవలలు ఉంటారు. విధివశాత్తు వాళ్ళిద్దరూ పుట్టిన వెంటనే విడిపోతారు. మళ్ళీ పెద్దయ్యాక అనుకోని సంఘటన ద్వారా ఎప్పుడో ఒక్కడో కలుస్తారు. ఇలాంటి కథతో తెలుగు తెర మీద మస్తు సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అచ్చంగా ఇలాంటిదే జరిగింది జార్జియా అనే దేశంలో. జార్జియాకు (Georgia) చెందిన సమరూప కవలలు అమీ ఖ్విటియా, అనో సార్టానియాలు పుట్టిన వెంటనే విడిపోయారు. 19 ఏళళ తర్వాత వైరల్ అయిన టిక్‌టాక్ వీడియోతో (TikTok) పాటు ఒక టాలెంట్ షో మళ్ళీ వీరిద్దరినీ కలిపింది.
Also Read:Andhrapradesh:టీడీపీ-జనసేన పొత్తుపై హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు
అసలేం జరిగిందంటే...
జార్జియాలోని (Georgia) ఆసుపత్రుల నుంచి పిల్లలు దొంగలించడం చాలా సర్వసాధారణం. దశాబ్దాలుగా ఇక్కడ ముఠాలు ఇదే పనిని చేస్తున్నాయి. ఈ కవలలను కూడా ఇలాగే అమ్మేశారు. అయితే, వీరిని అమ్మేసింది మాత్రం తండ్రే. కవలలు అయిన అమీ ఖ్విటియా(Amy Khvitia), అనో సార్టానియాలు (Ano Sartania) పుట్టిన వెంటనే వాళ్ల అమ్మ అజా షోనీ 2002లో ప్రసవ సమయంలో అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లిపోయారు. దాంతో ఆమె భర్త గోచా గఖారియా పిల్లలను చూసుకోలేను అనే ఆలోచనతో అనో , అమీలను వేరు కుటుంబాలకు విక్రయించారు.
ఎలా కలుసుకున్నారు...
పుట్టిన వెంటనే విడిపోయిన అమీ ఖ్విటియా, అనో సార్టానియాలు మళ్ళీ 12 ఏళ్ళ వరకు కలవనే లేదు. అనో టిబిలిసిలో.. అమీ జుగ్దిడిలో పెరిగారు. ఇద్దరికీ ఒకరి ఉనికి గురించి మరొకరికి పూర్తిగా తెలియదు. 12 వయసులో అది కూడా ఒక టీవీ షో ద్వారా చూసుకున్నారు. తనకు ఇష్టమైన టీవీ షో 'జార్జియాస్ గాట్ టాలెంట్'లో అచ్చం తన పోలికలతో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని చూసి అమీ షాకయ్యింది. అయితే డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయి తాను కోల్పోయిన సోదరేనని ఆమెకు అప్పటికీ తెలియదు. మరోవైపు తనలాగే నీలిరంగు జుట్టుతో టిక్‌టాక్ లో డాన్సులు చేస్తున్న యువతిని అనో చూసింది. అచ్చం నాలాగే ఉందే అనుకుంది. అలా వారిద్దరూ ఒకరినొకరు ఫాలో అయ్యారు. ఇద్దరూ డాన్సర్లు కావడం, ఒకేలా కనిపించడంతో అనుమానం వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. దాంతో ఇద్దరూ కవలలమని తెలుసుకున్నారు. అలా 19 ఏళ్ళ తర్వాత ఇద్దరు కవలలూ కలుసుకున్నారు. జార్జియా రాజధాని టిబిలిసీలోని రుస్తావేలీ వంతెనపై అమీ, అనో 19 సంవత్సరాల తర్వాత మొదటిసారి కలుసుకున్నారు.