Rythu Bandhu:రైతుబంధు జమ అయ్యేది అప్పుడేనా ? తెలంగాణలో రైతుబంధు అర్హులు 68.56 లక్షల మంది రైతులు ఉండగా.కేవలం ఎకరం లోపు రైతులకు మాత్రమే రైతుబంధు పంపిణి చేసింది రేవంత్ సర్కార్. మరో 39 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం ఇంకా అందలేదు . ధీంతొ అన్నదాతలు రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారు. By Nedunuri Srinivas 21 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rythu Bandhu: రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు అమలు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోంది. ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన లక్షాలది దరఖాస్తులను పరిశీలించే పనిలో ఉంది. ఇదిలా ఉంటె .. గత ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం ఇప్పుడు నత్త నడకన సాగుతుండటంతో రైతుబంధు కోసం అన్నదాతల ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 9నే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న కాంగ్రెస్ సర్కారు 40 రోజులు దాటినా రైతుబంధు పంపిణీ చేయకపోవడంతో అన్నదాతలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. విడతల వారీగా నిధులు విడుదల తెలంగాణలో రైతుబంధు అర్హులు 68.56 లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటివరకూ కేవలం ఎకరం లోపు రైతులకు మాత్రమే రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేసి రైతుబంధు పంపిణి చేసింది రేవంత్ సర్కార్. మరో 39 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం ఇంకా అందలేదు . ధీంతొ అన్నదాతలు రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారు. ఇక.. మిగిలిన వారికి రైతుబంధు సాయం పూర్తి కావాలంటే రూ. 7,625 కోట్లు అవసరం అవుతుంది.అందుకోసమే విడతల వారీగా నిధులు విడుదల చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుబంధుపై తుమ్మల క్లారిటీ రైతుబంధు పంపిణీలో జాప్యం జరగటానికి గల కారణాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివరణ ఇవ్వడం కూడా జరిగింది. నెలఖారుకు రైతులందరికీ రైతుబంధు అందిస్తామని మంత్రి తుమ్మల అన్నారు. రైతుబంధు నిధుల జమపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎకరంలోపు రైతులకు రైతుబంధు జమ చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు జమ చేస్తామని చెప్పారు. మొత్తం రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య 70 లక్షలు ఉన్నట్లు తెలిపారు. 29 లక్షల మందికి రైతుబంధు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.700 కోట్ల నిధుల జమ చేసినట్లు వెల్లడించారు. రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ తెలంగాణలోని రైతులు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న క్రాప్ లోన్ల(Crop Loans) వల్ల వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. తర్వాత బ్యాంకులకు విడతలవారీగా ప్రభుత్వం కట్టనుంది. ఇందుకోసం SLBC, ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది సర్కార్.2023 డిసెంబర్ 7వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తించనుంది. రూ.28వేల కోట్ల మేర లోన్లు ఉంటాయని బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలిపారు. ఇందులో రూ.లక్ష వరకు ఉన్న పంట రుణాలే 80శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ చేయడం ద్వారా దాదాపు 30లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ALSO READ:సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ #telangana #cm-revanth-reddy #crop-loans #rythu-bandh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి