చిన్నారి మృతిపై స్పందించిన టీటీడీ.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన చిన్నారిపై శుక్రవారం రాత్రి చిరుత పులి దాడి చేసిన ఘటనపై టీటీడీ స్పందించింది. మృతురాలు లక్షత (6) కుటుంబానికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. దీంతోపాటు అటవీ శాఖ నుంచి మరో 5 లక్షల రూపాయలను అందిచనున్నట్లు తెలిపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఒక్కొక్కరిగా రావద్దని, గుంపులుగా రావాలని టీటీడీ సూచించింది. మ

New Update
చిన్నారి మృతిపై స్పందించిన టీటీడీ..  చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన చిన్నారిపై శుక్రవారం రాత్రి చిరుత పులి దాడి చేసిన ఘటనపై టీటీడీ స్పందించింది. మృతురాలు లక్షత (6) కుటుంబానికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. దీంతోపాటు అటవీ శాఖ నుంచి మరో 5 లక్షల రూపాయలను అందిచనున్నట్లు తెలిపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఒక్కొక్కరిగా రావద్దని, గుంపులుగా రావాలని టీటీడీ సూచించింది. మరోవైపు ప్రమాదక జోన్లలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా దాడి జరిగిన పరిసర ప్రాంతాల్లో అధికారులు పులిని బంధించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 7వ మైల్ నుంచి నరసింహ స్వామి ఆలయం వరకూ హై అలెర్ట్ జోన్‌గా ప్రకటించారు. చెట్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా చిరుతను బంధిస్తామని అటవీ శాఖ సిబ్బంది స్పష్టం చేశారు.

కాగా నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్‌ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లారు. అలిపిరి నడకదారి నుంచి తిరుమలకు బయలు వేరారు. కొద్ది దూరం వెళ్లిన అనంతరం పాప కన్పించకుండా పోయింది.దీంతో భయాందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు పరిసర ప్రాంతం మొత్తం వెతికారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో పోలీసులు అటవీ ప్రాంతాన్ని గాలించగా.. నరసింహస్వామి ఆలయం వద్ద లక్షిత మృతదేహం కనిపించింది. లక్షిత శరీరంపై గాయాలు చూసిన పోలీసులు పాపపై చిరుత దాడి చేసినట్టుగా గుర్తించారు. పాపను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు బోరునా విలిపించారు. నిన్నమొన్నటి వరకు లక్షిత ముద్దుముద్దు మాటలతో మురిసిపోయిన ఆ కుటుంబసభ్యుల ముఖాల్లో ఇప్పుడు విషాదం తప్ప మరెదీ కనిపించని స్థితి. ఎంతో చలాకీగా ఉండే లక్షితను అలా చూసే సరికి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు.

మరోవైపు ఈ ఏడాది జూన్‌లో కూడా ఈ తరహా ఘటనే జరగగా.. అప్పుడు బాలుడు మాత్రం ప్రాణాలతో బతికాడు. అలిపిరి నడకదారి మార్గంలో ఆదోనికి చెందిన కుటుంబం తిరుమలకు నడిచి వెళుతుండగా.. ఏడో మైలు వద్ద బాలుడు తాతతో కలిసి ఓ షాపు దగ్గర స్నాక్స్ కొనుగోలు చేసే సమయంలో బాలుడిపై చిరుత దాడి చేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇక కంట్రోల్‌ రూం వద్ద బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది చిరుత. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించగా కోలుకున్నాడు. ఆ వెంటనే చిరుతను పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేయగా చిరుత చిక్కింది. ఏడాదిన్నర వయసు ఉన్న చిరుత కావడంతోనే బాలుడిని చంపలేకపోయింది. చిరుత బోనులో చిక్కడంతో అప్పట్లో భక్తులు ఊపిరి పీల్చుకోగా.. తాజాగా బాలికపై చిరుత దాడి చేయడం.. లక్షిత చనిపోవడంతో భక్తుల్లో

Advertisment
Advertisment
తాజా కథనాలు