TTD : మహిళ మీద దౌర్జన్యం చేసిన టీటీడీ ఉద్యోగి

తిరుమలలో హైదరాబాద్‌లో దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. గర్భగుడిలో స్వామి దర్శనం చేసుకునే సమయంలో టీటీడీ సిబ్బంది చెయ్య పట్టుకుని లాగేసినట్లు తెలస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం ఇచ్చారని చెబుతున్నారు.

New Update
TTD : మహిళ మీద దౌర్జన్యం చేసిన టీటీడీ ఉద్యోగి

Family Alleges Misbehaviour by TTD : గర్భగుడిలో టీటీడీ (TTD)సభ్యులు అసభ్యకంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు హైదరాబాద్ కుటుంబానికి చెందిన దంపతులు. శ్రీవాణి ట్రస్టుకు రూ.10,500 చొప్పున చెల్లించి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి వెళ్తే గర్భాలయంంలోని సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. టీటీడీ ఉద్యోగి తన భార్య చేయి పట్టుకుని పక్కకు తోశాడని.. అలా చేయొద్దని చెబితే తానిలానే ఉంటానని ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా చెప్పారని అన్నారు.
తమ వెనుక ఉన్న మరో మహిళతో కూడా అలాగే చేశారని..ఆ క్రమంలో ఆమె చేతిగాజులు సైతం విరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Also read:ఇప్పుడు కాదు.. ఆ తరువాతే.. కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్..

తాము 25, 30 ఏళ్ళ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నామని...ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని చెబుతున్నారు దంపతులు (Family). అంత దూరం నుంచి వస్తే ఇలా చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సరిగ్గా మాట్లాడడం లేదని కూడా అంటున్నారు. మీ దిక్కున్నచోట చెప్పుకోండి అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని...దీనిని టీటీడీ సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆ ఉద్యోగి ఎవరో తెలియదని...ఐడీ కార్డు వేసుకోలేదని చెబుతున్నారు. అయితే తామేమీ ఆ ఉద్యోగి మీద కంప్లైంట్ చేయాలని అనుకోవడం లేదు కానీ టీటీడీ అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని టీడీపీ కూడా తన ఎక్స్ లో షేర్ చేసింది. టీటీడీని ఏం చేద్దామనుకుంటున్నావ్ జగన్ అంటూ ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం అన్న ప్రసాదాలు నాణ్యత లేదంటూ గొడవ జరిగింది.

Advertisment
తాజా కథనాలు