Telangana: ఆగస్టు 4న టీటీసీ పరీక్ష టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (లోయర్ గ్రేడ్ ) థియరీ పరీక్షలు ఆగస్టు 4న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. వెట్ సైట్ లో హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలి. By Manogna alamuru 25 Jul 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TTC Exam : టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (లోయర్ గ్రేడ్ ) థియరీ పరీక్షలు ఆగస్టు 4న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 4న ఆదివారం ఎడ్యుకేషనల్ సైకాలజీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ పరీక్ష 3.30 నుంచి 4:30 వరకు జరుగుతాయని తెలిపారు.అభ్యర్థులు జులై 24 తేదీ నుండి www.bse.telangana.gov.in నుండి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ట్రైనింగ్ సెంటర్, ట్రేడ్ పేరు, అభ్యర్థి పేరు ,పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందవచ్చని తెలిపారు. Also Read:Telangana: దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ #telangana #exam #august #ttc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి