India Vs England Test Match: ఇండియా vs ఇంగ్లాడ్ టెస్ట్ మ్యాచ్.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన TSRTC ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఇండియా VS ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ జరగనున్న వేళ.. టీఎస్‌ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిజూ ఉదయం 8 గంటలకు ఈ బస్సులు బయలుదేరుతాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. By B Aravind 24 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TSRTC Special Buses: హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఇండియా VS ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ (India Vs England) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి.. ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వరకు ఏకంగా 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ? అయితే ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత తిరిగి రాత్రి 7 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే క్రికెట్ అభిమానులు ఈ ప్రత్యేక బస్సుల సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ (VC Sajjanar) కోరారు. ఇక బస్సు రూట్ల వివరాలు ఇవే. Also Read: కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది ఖైదీలు మృతి #sports-news #cricket-news #test-match #inidia-vs-england మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి