TSRTC Nursing College : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)నిరుద్యోగులకు వరుస తీపి కబుర్లు అందిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. తాజాగా మరో ఉద్యోగ ప్రకటన వెలువరించింది.
ఈ మేరకు హైదరాబాద్ తార్నాక (Tarnaka)లోని నర్సింగ్ కాలేజీలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
తార్నాక నర్సింగ్ కాలేజీ..
ఎంఎస్సీ (M.Sc.) (నర్సింగ్), పీహెచ్‌డీ (Ph.D.) (నర్సింగ్) అర్హతలున్నవారు జనవరి 23న తార్నాకలోని ఆర్టీసీ నర్సింగ్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సంబంధిత అధికారులు సూచించారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించనుండగా.. అభ్యర్థులు అవసరమైన అన్ని విద్యార్హత సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని తెలిపారు.
పోస్టుల వివరాలు :
వైస్ ప్రిన్సిపాల్: 01
అర్హతలు:
ఎంఎస్సీ (నర్సింగ్), పీహెచ్‌డీ (నర్సింగ్) ఉండాలి.
అనుభవం:
ఎంఎస్సీ (నర్సింగ్) అర్హతతో 12 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 10 సంవత్సరాల టీచింగ్ (అబ్‌స్టేట్రిక్స్, పీడియాట్రిక్ నర్సింగ్) అనుభవం ఉండాలి.
వేతనం: రూ.65,000 ఉంటుంది.
అసోసియేట్ ప్రొఫెసర్: 01
అర్హతలు:
ఎంఎస్సీ (నర్సింగ్), పీహెచ్‌డీ (నర్సింగ్) ఉండాలి.
అనుభవం:
ఎంఎస్సీ (నర్సింగ్) అర్హతతో 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాల టీచింగ్ (అబ్‌స్టేట్రిక్స్, పీడియాట్రిక్ నర్సింగ్) అనుభవం ఉండాలి.
వేతనం: రూ.38,000 ఉంటుంది.
ఇది కూడా చదవండి : TSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష లేకుండా ఆర్టీసీలో ఉద్యోగాలు
ట్యూటర్: 01
అర్హతలు:
ఎంఎస్సీ (నర్సింగ్), పీహెచ్‌డీ (నర్సింగ్) ఉండాలి.
అనుభవం:
బీఎస్సీ (నర్సింగ్) లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అర్హతతో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వేతనం: రూ.25,000 ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
ఎంపిక విధానం:
అర్హతలు, పని అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి:
ఒక సంవత్సరం. అభ్యర్థుల పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ వ్యవధిని పెంచే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన తేదీ: జనవరి 23, 2024
ఇంటర్వ్యూ వేదిక: TSRTC College for Nursing, Tarnaka Hospital, Hyderabad.
అభ్యర్థులు పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్ సందర్శించండి. https://tsrtc.telangana.gov.in/