JOBS : తార్నాక నర్సింగ్ కాలేజీలో ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూలు టీఎస్ ఆర్టీసీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ తార్నాకలోని నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు దరఖాస్తులు కోరింది. ఎంఎస్సీ, పీహెచ్‌డీ అర్హతగల అభ్యర్థులను జనవరి 23న ఇంటర్వ్యూలకు ఆహ్వానించింది. By srinivas 22 Jan 2024 in జాబ్స్ హైదరాబాద్ New Update షేర్ చేయండి TSRTC Nursing College : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)నిరుద్యోగులకు వరుస తీపి కబుర్లు అందిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. తాజాగా మరో ఉద్యోగ ప్రకటన వెలువరించింది. ఈ మేరకు హైదరాబాద్ తార్నాక (Tarnaka)లోని నర్సింగ్ కాలేజీలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తార్నాక నర్సింగ్ కాలేజీ.. ఎంఎస్సీ (M.Sc.) (నర్సింగ్), పీహెచ్‌డీ (Ph.D.) (నర్సింగ్) అర్హతలున్నవారు జనవరి 23న తార్నాకలోని ఆర్టీసీ నర్సింగ్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సంబంధిత అధికారులు సూచించారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించనుండగా.. అభ్యర్థులు అవసరమైన అన్ని విద్యార్హత సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. పోస్టుల వివరాలు : వైస్ ప్రిన్సిపాల్: 01 అర్హతలు: ఎంఎస్సీ (నర్సింగ్), పీహెచ్‌డీ (నర్సింగ్) ఉండాలి. అనుభవం: ఎంఎస్సీ (నర్సింగ్) అర్హతతో 12 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 10 సంవత్సరాల టీచింగ్ (అబ్‌స్టేట్రిక్స్, పీడియాట్రిక్ నర్సింగ్) అనుభవం ఉండాలి. వేతనం: రూ.65,000 ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్: 01 అర్హతలు: ఎంఎస్సీ (నర్సింగ్), పీహెచ్‌డీ (నర్సింగ్) ఉండాలి. అనుభవం: ఎంఎస్సీ (నర్సింగ్) అర్హతతో 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాల టీచింగ్ (అబ్‌స్టేట్రిక్స్, పీడియాట్రిక్ నర్సింగ్) అనుభవం ఉండాలి. వేతనం: రూ.38,000 ఉంటుంది. ఇది కూడా చదవండి : TSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష లేకుండా ఆర్టీసీలో ఉద్యోగాలు ట్యూటర్: 01 అర్హతలు: ఎంఎస్సీ (నర్సింగ్), పీహెచ్‌డీ (నర్సింగ్) ఉండాలి. అనుభవం: బీఎస్సీ (నర్సింగ్) లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అర్హతతో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. వేతనం: రూ.25,000 ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. ఎంపిక విధానం: అర్హతలు, పని అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. కాంట్రాక్ట్ వ్యవధి: ఒక సంవత్సరం. అభ్యర్థుల పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ వ్యవధిని పెంచే అవకాశం ఉంది. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన తేదీ: జనవరి 23, 2024 ఇంటర్వ్యూ వేదిక: TSRTC College for Nursing, Tarnaka Hospital, Hyderabad. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్ సందర్శించండి. https://tsrtc.telangana.gov.in/ #tsrtc #recruitment #tarnaka #nursing-college మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి