/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TSRTC-MD-Sajjanar-jpg.webp)
Medaram : తెలంగాణ కుంభమేళ మేడారం జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. పెద్దెత్తున భక్తులు మేడారంకు తరలివెళ్తున్నారు. నాలుగు రోజుల పాటు ఘనంగా సాగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. దీంతో భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ఇప్పటికే 6వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా సాధారణ ప్రయాణికులకు రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ కుంభమేళగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారక్క మహాజాతరకు తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం 6వేల స్పెషల్ బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు మేడారానికి వెళ్లాయి. భక్తులు ఎక్కువగా వెళ్లే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి..అక్కడి నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. జాతరకు మహాలక్ష్మీ పథకం అమలు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంట ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!!
తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024
భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6వేల బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున సాధారణ సర్వీసులను తగ్గించినట్లు తెలిపారు. దీంతో సాధారణ ప్రయాణీకులకు కొంత అసౌకర్యం కలిగి ఛాన్స్ ఉందని..జాతర సమయంలో భక్తులకు ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనసుతో సహకరించాలని సజ్జనార్ సాధారణ ప్రయాణికులకు రిక్వెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: 70 కుక్కలకు విషమిచ్చి చంపేశారు.. సర్పంచ్ పై కేసు..!!