Free Bus: TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్సులు సంక్రాంతి పండుగ దగ్గరపడుతున్న వేళ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి సమయంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. By V.J Reddy 04 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Free Bus Scheme Sankranthi: మరొకొన్ని రోజుల్లో సంక్రాంతి (Sankranthi Buses) పండుగ వస్తున్న తరుణంలో ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ (TSRTC) తీపి కబురు అందించింది. సంక్రాంతికి సొంత ఊర్లోకి వెళ్తున్న మహిళలకు ఉచిత బసు ప్రయాణం పథకం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) స్పష్టం చేశారు. మహిళలలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని మరోసారి తెలిపారు. ALSO READ: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇది కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులు నడుపుతామని అన్నారు. ఆంధ్రకు వెళ్లే తెలంగాణ బస్సుల్లో కేవలం తెలంగాణ సరిహద్దు వరకే ఈ ఫ్రీ టికెట్ ఉండవచ్చని తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని టీఎస్ ఆర్టీసి రద్దు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. శబరిమల వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రం నుంచి స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లే వారి కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులను రాష్ట్రంలో జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శబరిమల వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సిబ్బంది ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటారని ఆర్టీసీ యజమాన్యం తెలిపింది. ఇటీవల శబరిమలలో జరిగిన , అయ్యప్ప భక్తులు పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నుంచి శబరిమల (Hyderabad to sabarimala) వెళ్లే ప్రతీ ప్రయాణికుని వద్ద నుంచి రూ. 13,600 చొప్పున వసూలు చేయనున్నారు. ఇందులో అల్పాహారం,మధ్యాహ్నం , రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు తెలిపింది. #mahalakshmi-scheme #sajjanar #special-buses #free-bus-scheme #tsrtc-free-bus-scheme #sankranthi-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి