హైదరాబాద్ శివారులో రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అయితే దీనిపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్) లో స్పందించారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్తున్న తమ బస్సులపై కారణాలు లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు.
Also read: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..
బస్సుల ప్రజల ఆస్తి అని.. వాటిని రక్షించుకోవాల్సింది కూడా ప్రజలేనని సజ్జనార్ అన్నారు. పోలీసుల సహాకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని.. బస్సు డ్యామేడీ ఖర్చులు వారి నుంచి వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
Also read: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు!