Seethakka: మంత్రి సీతక్క స్వగ్రామానికి ఎట్టకేలకు రానున్న ఆర్టీసీ బస్సు..

ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క స్వగ్రామమైన జగ్గన్నపేటకు ఇంతవరకు ఆర్టీసీ బస్సు వెళ్లేది కాదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆమె స్వగ్రామానికి బస్సు రానుంది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు బుధవారం ఆ మార్గంలో సర్వే చేశారు. త్వరలో బస్సు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

New Update
Seethakka: మంత్రి సీతక్క స్వగ్రామానికి ఎట్టకేలకు రానున్న ఆర్టీసీ బస్సు..

గతంలో మావోయిస్టులతో కలిసి పనిచేసి.. ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయి రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క తెలంగాణలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ఇప్పుడు పంచాయతీ రాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మరింత క్రేజ్‌ని సంపాదించుకున్నారు సీతక్క. అయితే ములుగు జిల్లాలోని ఆమె స్వగ్రామమైన జగ్గన్నపేటకు ఇంతవరకు ఒక్క బస్సు కూడా రాలేదు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడంతో అక్కడి స్థానికులు ఆటోలపైనే ఆధారపడేవారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆమె స్వగ్రామానికి బస్సు రానుంది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు బుధవారం ఆ మార్గంలో సర్వే చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మహాలక్ష్మీ పథకం కింద రాష్ట్రవ్యా్ప్తంగా ఆర్టీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!

అయితే ఈ నేపథ్యంలో ములుగు జిల్లాకు సంబంధించి పల్లెలకు బస్సులు రావు అనే కథనాలు పత్రికల్లో రావడంతో రోడ్డు రవాణా శాఖ అధికారులు స్పందించి రూట్‌ సర్వే చేశారు. త్వరలోనే ఆ మార్గంలో బస్సు నడిపిస్తామని తెలిపారు. పత్తిపల్లి-పొట్లాపూర్ మార్గంలో బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

Also Read: భూ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు.. సీఎం రేవంత్ ఆదేశాలు..

Advertisment
తాజా కథనాలు