Group-1: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే నోటిఫికేషన్..

గతంలో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేయడంతో.. ఈ తీర్పును సవాలు చేస్తూ TSPSC సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. దీంతో త్వరలోనే గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల కానుంది.

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన ..పరీక్ష తేదీ ఖరారు.!
New Update

TSPSC Group 1 Update: తెలంగాణలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయిపోయింది. గతంలో TSPSC.. సుప్రీంకోర్టులో (Supreme Court) వేసిన పిటిషన్‌ను తాజాగా ఉపసంహరించుకుంది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో కొత్త గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రెండేళ్ల క్రితం మొదటిసారిగా గ్రూప్‌ -1 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ పేపర్ లీక్ అవ్వడం వల్ల ఆ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Also read:  రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ.. పెద్దల సభకు వెళ్లేది వీరేనా?

ఇక రెండోసారి నిర్వహించిన పరీక్షలో కూడా కొందమంది అభ్యర్థులకు సంబంధించి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు గ్రూప్‌-1 పరీక్షలను రద్దు చేసింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ.. అప్పటి బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పుడు గ్రుప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంది. దీంతో గ్రూప్-1 పరీక్ష తేదీ త్వరలోనే రానుంది.

అయితే గతంలో ఉన్న 503 గ్రూప్‌-1 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఖాళీల సంఖ్య మొత్తం 563కు చేరుకుంది. ఈపోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉండగా.. గతంలో 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్‌-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని కూడా 46 ఏళ్ల వరకు సడలిస్తామని రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో హామీ ఇచ్చారు.

Also Read: కృష్ణా ప్రాజెక్టులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి VS హరీశ్‌రావు

#telugu-news #group-1 #tspsc-group-1 #tspsc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe