TSPSC : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. కొలువుల భర్తీ అప్పుడే

తెలంగాణలో ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. అప్పటిలోగా రాతపరీక్షల తుది 'కీ' ల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయనుంది.

TSPSC : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. కొలువుల భర్తీ అప్పుడే
New Update

Good News For Un-Employees : తెలంగాణ(Telangana) లో ప్రభుత్వ ఉద్యోగాలను(Government Jobs) త్వరగా భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ(TSPSC) దృష్టి సారించింది. ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం విడుదల చేయాలని యోచిస్తోంది. అప్పటిలోగా రాతపరీక్షల తుది 'కీ' ల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, ధ్రవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ మేరకు రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను కొనసాగిస్తోంది.

Also Read: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

27సార్లు ఉద్యోగ ప్రకటనలు 

2022 నుంచి ఇప్పటిదాకా 18 వేలకు పైగా ఉద్యోగాలతో.. మొత్తం 27 సార్లు ఉద్యోగ ప్రకటనలు చేసింది టీఎస్‌పీఎస్సీ. 2023లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడటంతో గ్రూప్‌ 1తో సహా 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో అధికారంలోకి కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్.. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి మళ్లీ నియమించింది. దీంతో కొత్తగా వచ్చిన టీఎస్‌పీఎస్సీ బోర్డు రెండు నెలల్లోనే మూడు నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి.. 10 ఉద్యోగ ప్రకటనలను జనరల్ ర్యాంకు జాబితాలను ప్రకటించింది.

గ్రూప్-1, గ్రూప్-2తో పాటు డీఏవో, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు సంబంధించి రాతపరీక్ష తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు కూడా త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనుంది. ఇందులో భాగంగా.. జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్-4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. ఏఈఈ పోస్టులకు(AEE Posts) సాధారణ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ప్రక్రియ ముగిసింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన తర్వాత తుది ఫలితాలు వెల్లడించనుంది. అలాగే ఏఈ పోస్టులకు సైతం తుది 'కీ' ని విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఇంటర్ విద్యా విభాగంలో.. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబర్‌లో ఉద్యోగ ప్రకటన జారీ చేయడం.. 2023 అక్టోబర్‌లో రాతపరీక్షలు పూర్తయిన సంగతి తెలిసిందే. మరో వారం, పది రోజుల్లో 'కీ' ని వెల్లడించాలని భావిస్తోంది టీఎస్‌పీఎస్సీ.

Also Read: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర సభ!

అయితే పరీక్షలకు సంబంధించి కీ విడుదల చేసిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలకు తావు లేకుండా చేసేందుకు కమిషన్‌ చర్యలు తీసుకుంటోంది. గతంలో ప్రశ్నపత్రం రూపొందించే సమయంలో నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇస్తుండేవారు. ఆ తర్వాత పరీక్ష రాసి అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని.. సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు తుది నిర్ణయం తీసుకునేవారు. అందుకే ఇప్పుడు ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులను పరిశీలించి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రాథమిక కీ ని వెల్లడించనున్నారు.

#telugu-news #national-news #tspsc #govt-jobs #2024-lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe