Tspsc Group 1 Final Key : తెలంగాణ గ్రూప్ -1(Telangana Group 1) ప్రిలిమ్స్ కు సంబంధించిన తుది కీ ని టీఎస్పీఎస్సీ(TSPSC) విడుదల చేసింది. జూన్ 11 న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 2.32 లక్షల మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 503 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమనరీ కీను జూన్ 28 నే విడుదల చేసింది.
తుది కీని ఆగస్టు 1 న విడుదల చేసింది. దీనికి సంబంధించి జులై 1 నుంచి 5 వరకు కీ పై అభ్యంతరాలను టీఎస్పీఎస్సీ స్వీకరించింది. త్వరలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 3 లక్షల 80 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2 లక్షల 32 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షను రాశారు.
తాజాగా 8 ప్రశ్నలను తొలగించడంలో 142 ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకుంటారు. మార్కులను మాత్రం 150 మార్కులకే లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో ఒక్కో సరైన సమాధానానికి 1.05 మార్కులను కేటాయించే అవకాశాలున్నాయి.సరైన సమాధానాలు లేని కారణంగా 3, 4, 5, 46, 54, 114, 128, 135 నంబర్ గల ప్రశ్నలను తొలగించారు.
ప్రశ్న నంబర్ 38కు ప్రాథమిక కీలో 3 ఆప్షన్‌ను సరైనదిగా ప్రకటించగా, తాజాగా ఆప్షన్ 2కు మార్చారు.ప్రశ్నసంఖ్య 59కు ప్రాథమిక కీలో ఆప్షన్ 1 సరైనదిగా ఇవ్వగా, తాజాగా ఆప్షన్ 3 సరైన సమాధానంగా ప్రకటించారు.
తుది కీ కూడా వచ్చేయడంతో పరీక్షకు సంబధించిన ఫలితాలను ఆగస్టు మొదటి వారంలోనే ఇవ్వాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేటి నుంచి పరీక్షకు హాజరైన వారి ఓఎంఆర్ షీట్లను కూడా వెబ్ సైట్ లో ఉంచనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన అనంతరం 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉంటే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై కూడా దృష్టి పెట్టింది టీఎస్పీఎస్సీ. నవంబర్‌లో పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఇటీవల భేటీ అయిన కమిషన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు, మెయిన్స్ నిర్వహణ, కొత్త పరీక్ష తేదీల ప్రకటన తదితర అంశాలపై చర్చించింది. ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన అనంతరం మెయిన్స్ కు కొంత సమయం ఇచ్చి నవంబరులో నిర్వహించాలనే ఆలోచనలో ఉంది.
Results at https://notificationslist.tspsc.gov.in/ma1773ba4464