Big Breaking: ఈ నెల 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు సిద్ధం కావాలన్న హరీశ్ రావు

అక్టోబర్ 16న వరంగల్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉంటుందని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఆ సభలోనే సీఎం మేనిఫెస్టో ప్రకటిస్తారన్నారు. మన మేనిఫెస్టో ప్రత్తిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందన్నారు. ప్రజలంతా శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండాలని కోరారు.

New Update
Big Breaking: ఈ నెల 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు సిద్ధం కావాలన్న హరీశ్ రావు
BRS Manifesto: అక్టోబర్ 16న వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ (BRS Meeting) ఉంటుందని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఆ సభలోనే సీఎం కేసీఆర్ (CM KCR) మేనిఫెస్టో ప్రకటిస్తారన్నారు. తమ మేనిఫెస్టో ప్రత్తిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందన్నారు. ప్రజలంతా శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో (BRS Manifesto) మహిళలకు శుభవార్త ఉంటుందన్నారు హరీశ్ రావు (Minister Harish Rao). మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు ఆయన. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన ప్రధానమైన హామీలను ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ (CM KCR) ప్రకటించే మేనిఫెస్టోపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పింఛన్ల పెంపుపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇంకా.. రైతు బంధు (Rythu Bandhu) సాయం పెంపుపై కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: న్నికల ఖర్చు పెంచండి.. ఆ గుర్తులు తొలగించండి: ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే..!!

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యింది. మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ రావు జిల్లాలను చుట్టేస్తున్నారు. టికెట్ దక్కని అసంతృప్తులను బుజ్జగించే పని కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఇంకా మాట వినని వారిని వదేలేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. టికెట్ ఖరారు చేయని స్థానాలపై కూడా పార్టీ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

జనగామ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నర్సాపూర్ లో సునీతారెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు కూడా సమాచారం. గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల పేర్లు కూడా నేడో రేపో ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటికే ఈ అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ హైకమాండ్.

Advertisment
Advertisment
తాజా కథనాలు