DK Aruna : రేవంత్ కు నన్ను ఓడించే సీన్ లేదు.. వంశీచంద్ ఓ చిల్లరోడు : డీకే అరుణ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ

మహబూబ్ నగర్ ఎంపీగా తన గెలుపును ఆపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించవని డీకే అరుణ అన్నారు. జిల్లా ప్రజలతో ఆయనకు సంబంధాలు లేవన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓ చిల్లర మనిషన్నారు. ఆర్టీవీకి డీకే అరుణ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

DK Aruna : రేవంత్ కు నన్ను ఓడించే సీన్ లేదు.. వంశీచంద్ ఓ చిల్లరోడు : డీకే అరుణ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ
New Update

DK Aruna Blasting Interview : కేసీఆర్ (KCR) మీద కోపంతోనే మహబూబ్ నగర్ (Mahabubnagar) లో ప్రజలు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ (DK Aruna). బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చేసిన పబ్లిసిటీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు నష్టం చేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజలను ఆకర్షించాయన్నారు. ఆ సమయంలోనే ఈ ఓటు రాష్ట్రానికి, తర్వాత బీజేపీకి అని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని గ్రామీణ ప్రాంత వాసులు సైతం కోరుకుంటున్నారన్నారు. తనకు ఓడిపోతానని వెంట్రుక మందం కూడా భయం లేదన్నారు. తనకు జిల్లా ప్రజలతో అనుబంధం ఉందన్నారు.

రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజలతో సంబంధాలు లేవు..
తనను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి జిల్లా ప్రజలతో సంబంధాలు లేవన్నారు. అదృష్టం కలిసొచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. తనపై దొరసాని అంటూ చేసిన విమర్శల ఎఫెక్ట్.. కాంగ్రెస్ పై ఉంటుందన్నారు. డీకే అరుణ అంటే ఏంటో అన్నది ప్రజలకు తెలుసన్నారు. తన భర్త ఏ వ్యాపారాలు చేసినా చట్టపరంగానే చేశారని స్పష్టం చేశారు. తనపై కేసులు పెట్టి బీఆర్ఎస్ లో చేరమని ఒత్తిడి తెచ్చారన్నారు. తనపై కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టినా కాంగ్రెస్ లో ఉన్న సమయంలో తనకు పార్టీ నుంచి మద్దతు లభించలేదన్నారు.

ఈర్ష్య జితేందర్ రెడ్డి పార్టీ మార్పు..
మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి (Vamshi Chand Reddy) చిల్లర మనిషి అని.. ఆయనకు వ్యక్తిత్వం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనేంటో, ఆయన బతుకేంటో కల్వకుర్తి, మహబూబ్ నగర్ ప్రజలకు తెలుసన్నారు. ఈర్ష్య కారణంగానే తనకు టికెట్ రాగానే జితేందర్ రెడ్డి పార్టీ మారాడని ఫైర్ అయ్యారు. ఆయన పార్టీలో ఉన్నప్పుడే తనను ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. కానీ పార్టీ కోసమే భరించానన్నారు. జితేందర్ రెడ్డి, జలేందర్ రెడ్డి పార్టీ మార్పు తన విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు.

Also Read : అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు

హైదరాబాద్ లో మాధవీలత గట్టి పోటీ..
బీజేపీలో గ్రూపు తగాదాలు లేవన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇచ్చిందన్నారు. ఈ సారి అక్కడ బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు నెలల్లోనే అసంతృప్తిని మూటగట్టుకుందన్నారు. అహకారంతోనే రేవంత్ రెడ్డి బీజేపీని ఖతం చేస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఫైర్ అయ్యారు. డీకే అరుణ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

#congress #revanth-reddy #dk-aruna #vamshi-chand-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe