TS Government Jobs : ఈ ఏడాదిలోనే 2 లక్షల కొలువుల జాతర.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?

ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మొదటగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ రానుంది.

TS Government Jobs : ఈ ఏడాదిలోనే 2 లక్షల కొలువుల జాతర.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
New Update

TSPSC : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను(TSPSC) ప్రక్షాళన చేసే పనిలో నిమగ్నమైన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. నిన్న స్వయంగా యూపీఎస్సీ(UPSC) చైర్మన్ మనోజ్ సోని(Manoj Sony) ని కలిశారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి వారు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. 2024 డిసెంబ‌ర్ నాటికి రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని తమ ప్రభుత్వం భావిస్తోందని యూపీఎస్సీ చైర్మన్ కు వివరించారు. ఇందుకు స్పందించిన మనోజ్ సోని టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ త‌ర‌హాలో తీర్చిదిద్దాల‌నుకుంటున్నందున.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ తో పాటు స‌భ్యుల‌కు తాము శిక్షణ ఇస్తామ‌ని ప్రకటించారు. స‌చివాల‌య సిబ్బందికి అవ‌గాహ‌న త‌ర‌గతులు నిర్వహిస్తామని తెలిపారు. అయితే.. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో(Un-Employees) ఆశలు చిగురించాయి. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేరకు వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతాయని వారు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: TS Government: తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ.. గౌరవవేతనం ఎంతంటే?

తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ(Congress Party) హామీ ఇచ్చింది. ఈ మేరుకు జాబ్ క్యాలెండర్(Job Calendar) సైతం విడుదల చేసింది. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదలయ్యే తేదీల వివరాలు ఇలా ఉన్నాయి..

  • గ్రూప్-1 నోటిఫికేషన్ ఫిబ్రవరి 1న
  • గ్రూప్-2: ఏప్రిల్ 1న ఫేజ్ 1, డిసెంబర్ 15న ఫేజ్ 2
  • గ్రూప్-3: జూన్ 1న ఫేజ్ 1, డిసెంబర్ 1న ఫేజ్ 2 నోటిఫికేషన్
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్/అసిస్టెంట్ ఇంజనీర్: మే
  • అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్, వెటర్నరీ ఆఫీసర్స్ ఫేజ్ 1 మే 1
  • టీచర్స్, హెడ్ మాస్టర్స్, గురుకుల ప్రిన్సిపాల్స్-ఫేజ్ 1 ఏప్రిల్ 1, ఫేజ్ 2 ఏప్రిల్ 15
  • వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీస్, జీపీ/మండల స్థాయి టెక్నికల్ స్టాఫ్-ఫేజ్-1 జూన్ 1
  • ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర యూనిఫామ్ స్టాఫ్‌: మార్చి 1న ఫేజ్-1, ఏప్రిల్ 12న ఫేజ్ 2

ఇతర నోటిఫికేషన్ వివరాలను కాంగ్రెస్ విడుదల చేసిన ఈ జాబ్ క్యాలెండర్ లో చూడొచ్చు..

publive-image

#upsc #cm-revanth-reddy #ts-government-jobs #tspsc #jobs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe