Telangana: విద్యార్థులకు అలెర్ట్.. ఎప్‌సెట్‌, ఐసెట్‌ పరీక్షల తేదీలు మార్పు

లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్‌ తెలంగాణలో ఎంట్రన్స్‌ పరీక్షలపై పడింది. మే 9 నుంచి 12వ తేదీ వరకు జరగాల్సిన ఎప్‌సెట్ పరీక్షలను మే 7 నుంచి 11 వరకు జరిగేలా మార్పులు చేశారు. జూన్ 4, 5వ తేదీల్లో జరగాల్సిన ఐసెట్‌ పరీక్షను జూన్ 5,6 తేదీలకు మార్చారు.

TS Lawcet 2024: తెలంగాణలో లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు ..పరీక్ష తేదీ ఇదే.!
New Update

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ EAPCET (గతంలో ఎంసెట్‌) పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఐసెట్ పరీక్ష తేదీలో కూడా మార్పులు చేసింది. వాస్తవానికి గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎప్‌సెట్ పరీక్షలు మే 9 నుంచి 12వ తేదీ వరకు జరగాలి. కానీ తెలంగాణలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: నన్ను దయచేసి నమ్మండి.. అందుకే బీఆర్ఎస్ లో చేరిన… ఆర్‌ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్

అయితే పరీక్షలకు ఎన్నికల తేదీకి ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండటం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావించింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌సెట్ తేదీలను మార్చింది. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు.

మరోవైపు ఐసెట్‌ పరీక్షలు జూన్ 4, 5వ తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో.. ఒకరోజు ఆలస్యంగా ఐసెట్ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర విద్యామండలి నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్ 5,6వ తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది.

Also Read: కాంగ్రెస్ లో ఆ తెలంగాణ పార్టీ విలీనం..!

#eapcet #icet #telugu-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి