Telangana: టీఎస్ ఈఏపీసెట్‌... గోరింటాకు.. టాటూలు వేసుకోవద్దు!

తెలంగాణ‌లో టీఎస్ ఎప్‌సెట్ ప‌రీక్షను మే 7 నుంచి 11వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్నారు.ప‌రీక్షా కేంద్రాల్లోకి వాట‌ర్ బాటిల్స్, ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల‌ను అనుమ‌తించ‌మ‌ని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. చేతుల‌కు గోరింటాకు, టాటూలు వంటి వాటిని పెట్టుకోకూడ‌ద‌ని తెలిపారు.

New Update
Telangana: టీఎస్ ఈఏపీసెట్‌... గోరింటాకు.. టాటూలు వేసుకోవద్దు!

తెలంగాణ‌లో టీఎస్ ఎప్‌సెట్ ప‌రీక్షను మే 7 నుంచి 11వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి మీడియాతో మాట్లాడారు. టీఎస్ ఎప్‌సెట్ ప‌రీక్ష‌కు ఈ ఏడాది 3.54 ల‌క్ష‌ల మందికి పైగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌ట్లు తెలిపారు. ప‌రీక్ష జ‌రిగే రోజుల్లో 90 నిమిషాల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమ‌తిస్తామ‌న్నారు.

ప‌రీక్షా కేంద్రాల్లోకి వాట‌ర్ బాటిల్స్, ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల‌ను అనుమ‌తించ‌మ‌ని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. చేతుల‌కు గోరింటాకు, టాటూలు వంటి వాటిని పెట్టుకోకూడ‌ద‌ని తెలిపారు. ఈ నిబంధ‌న‌ల‌ను విద్యార్థులు క‌చ్చితంగా పాటించాల్సిందేన‌ని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఇంజినీరింగ్‌కు 2,54,543 మంది, అగ్రికల్చ‌ర్ అండ్ ఫార్మాకు 1,00,260 మంది చొప్పున విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 3,54,803 ద‌ర‌ఖాస్తులు అందాయ‌ని పేర్కొన్నారు.

ఈఏపీసెట్ ప‌రీక్ష‌ను 21 జోన్ల‌లో నిర్వ‌హిస్తుండ‌గా, తెలంగాణ‌లో 16, ఏపీలో 5 జోన్లు ఏర్పాటు చేశామ‌న్నారు. అగ్రిక‌ల్చ‌ర్ అండ్ ఫార్మాకు 135, ఇంజినీరింగ్‌కు 166 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. గ‌తంతో పోలిస్తే ఈ ఏడాది 20 కేంద్రాలు అద‌నంగా ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు.

Also read: ఘోర ప్రమాదం..డ్యామ్ కూలి 42 మంది మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు