Hing Water: బరువు, మధుమేహం తగ్గించే ఇంగువ వాటర్‌..ఇలా చేసుకోండి

జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే అనేక పదార్ధాలలో ఇంగువ ఒకటిని నిపుణులు చెబుతున్నారు. ఇంగువ వాటర్ తగటం వలన బరువు-మధుమేహం కంట్రోల్‌, జీర్ణ శక్తి పెరుగుతుంది, మంట నుంచి ఉపశమనం వంటి లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఇంగువ అదుపులో ఉంచుతుంది.

New Update
Hing Water: బరువు, మధుమేహం తగ్గించే ఇంగువ వాటర్‌..ఇలా చేసుకోండి

Hing Water: మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే అనేక పదార్ధాలలో ఇంగువ ఒకటి. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు దివ్యౌషధం. సహజంగా ఉండటం వల్ల ప్రయోజనాలు ఎక్కువ. జీర్ణవ్యవస్థకు ఇంగువ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది శరీరాన్ని పోషకాలను ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. ఇంగువ వలన ఎలాంటి ఉపయోగాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బరువు-మధుమేహం కంట్రోల్‌:

  • ఇంగువను రోజూ ఆహారంలో తీసుకునే వారు శరీర బరువు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంగువను నీటిలో కలిపి తాగడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి.

మంట నుంచి ఉపశమనం:

  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉన్న ఇంగువ ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌లను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీర బరువును తగ్గించి జీర్ణ సమస్యలు లేకుండా చూస్తుంది.

జీర్ణ శక్తి పెరుగుతుంది:

  • ఇంగువ అజీర్తికి దివ్యౌషధం. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యను తొలగించే గుణం కలిగి ఉంటుంది. మీరు తీసుకున్న ఆహారం నుంచి మంచి పోషకాలను శరీరానికి సక్రమంగా అందేలా చేస్తుంది. జీవక్రియను మెరుగుపరిచి శరీర బరువును అదుపులో ఉంచుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇంగువ తీసుకునే వారికి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇంగువ నీరు ఎలా తయారు చేయాలి?

  • ముందుగా ఒక గ్లాసు నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి, అందులో కాస్త ఇంగువ వేయాలి, దీన్ని బాగా కలిపి కొన్ని నిమిషాలు మరించాలి. ఆ తర్వాత తీసి వడకట్టుకోవాలి. అందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం వేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: శరీరంలో ఈ 5 మార్పులు కనిపిస్తే ఒమేగా-3 లోపం ఉన్నట్టే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పచ్చి బొప్పాయిని వంటలో ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు