Stress Tips: ఒత్తిడి, టెన్షన్‌ను దూరం చేసే టెక్నిక్స్‌.. మీరూ ట్రై చేయండి

ఒత్తిడి వల్లే అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. శరీరంలో ఒత్తిడిని తగ్గించే పని కార్డిసాల్‌ అనే హార్మోన్‌ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి డార్క్ చాక్లెట్లు, సిట్రస్ పండ్లు, ఆకు కూరలు, అవోకాడో, బాదం, వాల్‌నట్స్, పిస్తా తింటే మంచిదంటున్నారు.

Stress Tips: ఒత్తిడి, టెన్షన్‌ను దూరం చేసే టెక్నిక్స్‌.. మీరూ ట్రై చేయండి
New Update

How to Relieve Stress Quickly:  కార్టిసాల్ అనే హార్మోన్ మన శరీరంలో ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. కార్టిసాల్ స్థాయిలు పెరిగేకొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతుంటారు. జీవనశైలిలో మార్పుల కారణం, పని కారణంగా తీవ్రమైన ఒత్తిడి కలుగుతోంది. ఒత్తిడి వల్లే అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఒత్తిడిని పూర్తిగా తొలగించడం అంత సులభం కాదు. అయితే కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా ఖచ్చితంగా ఒత్తిడిని జయించవచ్చని నిపుణులు అంటున్నారు.

ఒత్తిడి ఎందుకు వస్తుంది?

  • వాస్తవానికి మన శరీరంలో ఒత్తిడిని తగ్గించే పని కార్డిసాల్‌ అనే హార్మోన్‌ చేస్తుంది. అయితే ఈ కార్డిసాల్‌ స్థాయిలు పెరిగితే ఒత్తిడి ఎకూడా పెరుగుతుందని, కొన్ని అలవాట్లతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్గాలు

  • ఒత్తిడికి, ఆహారానికి సంబంధం ఉంటుంది. న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. అంతేకాకుండా టెన్షన్‌ను కూడా తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పుదీనా లేదా లెమన్ గ్రాస్ టీ కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి డార్క్ చాక్లెట్లను కూడా తినవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, అవోకాడో, బాదం, వాల్‌నట్స్, పిస్తా, చియా గింజలు, అవిసె గింజలలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తాయి. సిట్రస్ పండ్లు, ఆకు కూరలు కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు.

స్మార్ట్‌ ఫోన్ల వినియోగం

  • ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ వాడకం బాగా పెరిగింది. నిద్రపోవడానికి గంట ముందు స్క్రీన్‌కు దూరంగా ఉండాలని, ఈ గాడ్జెట్స్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ నిద్రపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఫోన్‌ని నిరంతరం ఉపయోగించడం వల్ల మెదడు చురుకుదనం పోతుందని, అంతేకాకుండా శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

యోగా-ధ్యానం చేయండి

  • యోగా, ధ్యానాన్ని మీ జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు. యోగా-ధ్యానం జీవితంలో సానుకూలతను తెస్తుందని, పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల శరీరం రిలాక్స్ అవుతుందని, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి : జుట్టు, గోర్లు కత్తిరించేప్పుడు నొప్పి ఎందుకు ఉండదు?.. అసలు కారణమేంటి?

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #best-health-tips #stress-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe