Harassment Allegation On Governor CV Ananda Bose: వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను లైగింకంగా వేధించారంటూ ఓ ఉద్యోగి కంప్లైంట్ చేస్తున్నారు. కోల్‌కతాలోని హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కూడా మహిళ ఫిర్యాదు కూడా చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద బోస్ తనను లైంగికంగా వేధించారంటూ రిపోర్ట్ లో తెలిపింది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపనలు రావడంతో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది.
అయితే తన మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని అంటున్నారు గవర్నర్ సీవీ ఆనంద్. ఇద్దరు ఉద్యోగులు కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా మారి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరో సృష్టించిన కథనాలకు తాను భయపడనని..నిజమే ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు. దీనివల్ల ఎవరైనా రాజకీయ ప్రయోజనం పొందాలనుకుటంఏ అది వారి ఇష్టమని వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని వారు నిలువరించలేరు’’ అని రాజ్‌భవన్ కార్యాలయం ఎక్స్ లో స్పందించారు సీవీ ఆనంద్.
ఈ వ్యవహారం మీద తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈ వార్తను విని తాము షాక్‌కు గురయ్యామని..సందేశ్‌ఖాలీలో మహిళా హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తే ఇప్పుడు ఇలాంటి పని చేశారు.. గవర్నర్ పదవికే అప్రతిష్ఠ తెచ్చారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరింది.