Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదోక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఇండియా కి మరోసారి వార్నింగ్ ఇస్తూ ఆయన తెరమీదకు వచ్చారు.
భారతీయ పన్ను వ్యవస్థను ఆయన తప్పు పట్టారు. అమెరికా ఉత్పత్తుల పై ఇండియా అధిక స్థాయిలో దిగుమతి పన్నును వసూల్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ..ఒకవేళ మళ్లీ తాను కానీ దేశాధ్యక్షుడు అయితే అప్పుడు తన తడాఖ చూపిస్తానని అన్నారు. భారతీయ ఉత్పత్తుల పైన దిగుమతి పన్ను (Reciprocal tax)ను పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
పన్నులను వసూల్ చేయడంలో ఇండియా టారిఫ్ కింగ్ అని గతంలో ఓ సారి కామెంట్ చేసిన విషయం తెలిసిందే. హర్లే డేవిడ్‌సన్ మోటార్ సైకిళ్ల (Harley-Davidson motorcycles) పైన కూడా భారత్ భారీగా పన్ను వసూల్ చేస్తున్నట్లు ఆయన గతంలో ఆరోపించారు.
హర్లే డేవిడ్‌సన్ మోటారుసైకిళ్ల అమ్మకాల విషయంలో ఓసారి ఇండియా వ్యాపారి శైలి గురించి ఆరా తీశానని, కానీ భారత్ అనుసరిస్తున్న పన్ను విధానం మనకు వ్యతిరేకంగా ఉన్నట్లు గ్రహించానన్నారు.
భారత్ లో తయారైన బైక్ లను అమెరికాలో ఎటువంటి పన్నులు వసూలు చేయకుండా అమ్ముతున్నప్పటికీ ..ఇండియాలో మాత్రం అమెరికాలో తయారైన బైక్ లను అత్యధిక స్థాయిలో పన్నును వసూలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భారతీయ పన్ను విధానాన్ని ప్రశ్నించినందుకు కొందరు సేనటర్లు తనను వ్యతిరేకించినట్లు కూడా ట్రంప్ (Trump)వెల్లడించారు. ఇండియా 200 శాతం పన్ను వసూల్ చేస్తే, మనం వంద శాతం కూడా చేయలేమా అని ఆయన ప్రశ్నించారు.
Also Read: చంద్రయాన్ గెలిచింది..రష్యా ఓడింది.. ఇది ఇండియా గెలుపే బాసూ!