Aishwarya: మేమూ మనుషులమే.. మాకూ భావోద్వేగాలుంటాయి.. రజనీ కూతురు
తండ్రి రజనీకాంత్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరగడంపై ఆయన కూతురు, డైరెక్టర్ ఐశ్వర్య స్పందించింది. 'మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలుంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. రజనీకాంత్ సంఘీ కాదు' అంటూ ఎమోషనల్ అయింది.
Chennai: తమిళ స్టార్ నటుడు రజనీకాంత్ (Rajinikanth)పై ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరిగిన నెగెటీవ్ ప్రచారంపై ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya) స్పందించింది. తన తండ్రి రజనీపై ట్రోల్స్ తమనెంతో బాధించాయని చెప్పింది. ఈమేరకు విష్ణు విశాల్ హీరోగా ఆమె దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లాల్ సలామ్’ (Lal Salaam) త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
#LalSalaam runtime is said to be
2hrs 45 minutes (165 mins)
Synopsis - Lal Salaam a political action drama. It is the story of a reckless town man mending his thug ways. He resurrects himself and his town and, in the process, proves to himself and the world worthy, in the eyes… pic.twitter.com/S1m5VR0nY7
మేమూ మనుషులమే..
‘నిజానికి నేను సోషల్‌మీడియాకు చాలా దూరంగా ఉంటా. ఆన్‌లైన్ నెగెటివిటీ గురించి నా టీమ్ ఎప్పుడూ చెబుతూనే ఉటుంది. వాటి వల్ల నేను కొన్నిసార్లు తీవ్ర ఆగ్రహాం, ఆందోళనకు గురైన సందర్భాలున్నాయి. మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నా. రజనీకాంత్ సంఘీ కాదు. అలా అయితే.. ఆయన ‘లాల్ సలామ్’లో నటించేవారు కాదు' అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
తప్పుగా అర్థం చేసుకున్నారు..
ఈ క్రమంలోనే రజనీకాంత్ మాట్లాడుతూ.. '‘జైలర్’ ఈవెంట్‌లో భాగంగా ‘అర్థమైందా రాజా’ అంటూ నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. విజయ్‌పై పరోక్షంగా మాటల దాడి చేశానన్నారు. అవి నన్నెంతో బాధించాయి. అతడు నా కళ్ల ముందు పెరిగాడు. టాలెంట్, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాడు. నాకు ఎవరితోనూ పోటీ లేదు. నాకు నేనే పోటీ. మా అభిమానులకు చెప్పేది ఒక్కటే.. మమ్మల్ని పోల్చి చూడొద్దు. ‘లాల్ సలామ్’ కథ విన్న వెంటనే యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నా. విష్ణు అద్భుతంగా నటించాడు. ఈ సినిమా చూశాక చిత్ర సంగీత దర్శకుడు రెహమాన్.. ఐశ్వర్యను ఎంతగానో మెచ్చుకున్నాడు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పాడు’ అంటూ రజనీ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
Aishwarya: మేమూ మనుషులమే.. మాకూ భావోద్వేగాలుంటాయి.. రజనీ కూతురు
తండ్రి రజనీకాంత్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరగడంపై ఆయన కూతురు, డైరెక్టర్ ఐశ్వర్య స్పందించింది. 'మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలుంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. రజనీకాంత్ సంఘీ కాదు' అంటూ ఎమోషనల్ అయింది.
Chennai: తమిళ స్టార్ నటుడు రజనీకాంత్ (Rajinikanth)పై ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరిగిన నెగెటీవ్ ప్రచారంపై ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya) స్పందించింది. తన తండ్రి రజనీపై ట్రోల్స్ తమనెంతో బాధించాయని చెప్పింది. ఈమేరకు విష్ణు విశాల్ హీరోగా ఆమె దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లాల్ సలామ్’ (Lal Salaam) త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మేమూ మనుషులమే..
‘నిజానికి నేను సోషల్‌మీడియాకు చాలా దూరంగా ఉంటా. ఆన్‌లైన్ నెగెటివిటీ గురించి నా టీమ్ ఎప్పుడూ చెబుతూనే ఉటుంది. వాటి వల్ల నేను కొన్నిసార్లు తీవ్ర ఆగ్రహాం, ఆందోళనకు గురైన సందర్భాలున్నాయి. మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నా. రజనీకాంత్ సంఘీ కాదు. అలా అయితే.. ఆయన ‘లాల్ సలామ్’లో నటించేవారు కాదు' అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Hyderabad: స్టంటర్ శ్రీకాంత్ రౌడీ, దొంగ, డ్రగ్గిస్ట్.. Rtv రిపోర్టులో సంచలన నిజాలు