Trivikram Srinivas : ఈ జనరేషన్ సినీ ప్రపంచానికి అతనొక టార్చ్ బేరర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ అభిమానులకు పరిచయం లేని పేరు. ఒక రచయితగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. మాటలనే మాలగా కూర్చి ప్రేక్షకులను మైమరిపించగల ఆకెళ్ల నాగ శ్రీనివాస్ పుట్టిన రోజు నేడు By srinivas 07 Nov 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Trivikram Srinivas Birthday: త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ అభిమానులకు పరిచయం లేని పేరు. ఒక రచయితగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. నిజానికి తన చిన్నతనంలో అవసరమైతేనే మాట్లాడతాడనే అపవాదు నుంచి మాటల మాంత్రికుడిగా ఎదిగిన ఆకెళ్ల నాగ శ్రీనివాస్.. ఇప్పుడు తన వాక్చాతుర్యంతో ఎంతో మందిని మంత్రముగ్దుల్నీ చేయగలుగుతున్నాడంటే అతిశయోక్తి కాదు. మాటలనే మాలగా కూర్చి ప్రేక్షకులను మైమరిపించగలడు. అందుకే మాట విలువ తెలుసు కనుకే ఆయన మాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారంటారు సినీ ప్రముఖులు. ఈ మాటల మాంత్రికుడి పుట్టిన రోజు సందర్భంగా అతనిలోని దాగివున్న కొత్త కొణాలను పాఠకులకు పరిచయం చేసేందుకు ఓ స్పెషల్ స్టోరీ. Also Read: మెగా ప్రిన్స్ పెళ్ళి వచ్చేది ఆ ఓటీటీలోనేనా… వినోద పరిశ్రమలో ప్రతీ రచయితకూ ఒకశైలి ఉంటుంది. త్రివిక్రమ్‌దీ కూడా అలాంటిదే. కానీ ఇయన కలంలో కాస్త చిలిపిదనం, వెటకారం, గాంభీర్యం కనిపిస్తుంది. ఆయన కథల్లో ఆత్మీయమైన మాటలు, సంభాషణలు వింటుంటే మనమే స్వయంగా ఆ పాత్రల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. 'వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయినట్లు.. ఫెయిల్ అయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్ అయిపోరు' అంటూ 'చిరునవ్వుతో మూవీలోని డైలాగ్ తో ఎంతో మంది మనుసులను కదిలించాడు. నిజానికి బయట ఈవెంట్ ల్లో అరుదుగా కనిపించే త్రివిక్రమ్ మైక్ చేతబడితే మాత్రం బలమైన, బరువైన మాటలను పంచుకుంటాడు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటలోనూ ఎంతో నిగూఢార్థం దాగి ఉంటుంది కాబట్టి యూట్యూబ్‌లో ఎల్లప్పుడూ ట్రెండ్ అవుతుంటాయి. Happy Birthday Guruji ❤️ #Trivikram #HappyBirthdayTrivikram pic.twitter.com/6zFSXgz3UT — Vinod (@Vinodstoriees) November 6, 2023 మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్లు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్లు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు' అంటూ నువ్వునాకు నచ్చావ్ లోని డైలాగ్ తో ఎంతోమంది మనసులు గెలిచాడు. ఇక 'అతడు'.. 'అఆ'లతో మొదలు పెట్టి సినీ ప్రేక్షకులను 'అలా వైకుంఠపురము' మీదుగా 'అత్తారింటికి' తీసుకెళ్లి అలరించిన తీరు అద్భుతం. అంతేకాదు తన అభిమానులను 'చిరునవ్వుతో' పలకరిస్తూనే 'తీన్‌మార్' ఆడించగల టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రశంసలు అదుకున్నాడు. పైకి 'అజ్ఞాతవాసి' లా కనిపించినా 'మన్మథుడు'తో 'జల్సా' చేయించి మంత్రముగ్దుల్ని చేయగలడు. సముద్రమంత లోతైన అర్థాలుండే ఆయన మాటలకు ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే. Happy birthday trivikram srinivas garu#Trivikram #guruji#HBDTrivikram pic.twitter.com/m9x8v3OnNl — NAVEEN KUMAR (@Naveenk2504) November 6, 2023 అలాగే 'మనం తప్పు చేస్తున్నామో.. రైట్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది.. మన ఒక్కళ్లకే తెలుస్తుంది' అంటూ నువ్వే నువ్వే సినిమాలోని డైలాగ్ తో తప్పదారిలో పయణిస్తున్న మనిషిని తట్టి లేపాడు. 'నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం' అని కుండ బద్దలు కొట్టేశాడు. అలాగే 'అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు' అంటాడు. ఇంతటితో ఆగిపోకుండా కుటుంబ బంధాల్లోని లొసుగులను ఎత్తి చూపుతూ 'తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. వెళ్లిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది' అంటూ రిలేషన్ విలువను తెలిపే ప్రయత్నం చేశాడు. 'పని చేసి జీతం అడగొచ్చు. అప్పు ఇచ్చి వడ్డీ అడగొచ్చు. కానీ హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్ అడగకూడదు' అంటూ ఆర్థిక బంధాలను తరిమి చూసిన జ్ఞాని. 'బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావ్ అని అడగడం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగటం అనవసరం' అంటాడు. 'కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం' అనే మాటలతోనే జీవిత పరమార్థాన్ని చెప్పాడు. 'మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు' అంటూ సమాజానికి హితబోధ చేశాడు. One Of The Best Scene In His Writings #NuvvuNakuNachavu #Trivikram #TrivikramSrinivas #HBDTrivikram @Trivikram_Fans 🙌 pic.twitter.com/nQdB1foFeM — అతడు (@vinays369) November 7, 2023 వీటన్నింటీకి మించి 'ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలుకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ, ప్రతి జనరేషన్‌లోనూ ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాడినే టార్చ్ బేరర్ అంటారు' అంటూ తాను సిని ప్రపంచానికి నిజంగా ఒక టార్చ్ బేరర్ గానే ఉన్నాడు. చివరగా 'గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునేవాళ్లతోనే' అంటూ స్నేహం, బంధం విలువలను తెలిపే ప్రయత్నం చేశాడు. చివరగా 'బెదిరింపునకు భాష అవసరం లేదప్పా అర్థమైపోతుంది' అంటూ ఎదుటి మనిషిని హావభావాలను పసిగట్టేతీరును వర్ణించిన ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. పురాణేతిహాసాలపై మంచి పట్టున్న మాటల మాంత్రికుడు తన పిల్లలకు పురాణ కథలు చెబుతుంటారు. ఈ తరమే కాదు రాబోయే తరాలు కూడా పురాణ కథలు తెలుసుకోవాలంటారు. అలాగే శ్రీనివాస్ సతీమణి సౌజన్య కూడా ఇందుకు మినహాయింపు కాదు. గృహిణిగా ఇంటి బాధ్యతలు, తల్లిగా ఇద్దరు పిల్లల ఆలనా పాలన చూస్తూనే.. మరోవైపు భరతనాట్యంలోనూ రాణిస్తున్నారు. అయితే ఆమె ఎదుగుదలకు కారణం కూడా శ్రీనివాసుడేనని చాలా సందర్బాల్లో చెప్పింది సౌజన్య. నాట్య ప్రదర్శనలకు సంబంధించి ఎంచుకునే కాన్సెప్టులు, సందేహాలు అతడినే అడిగి తెలుసుకుంటుందట. ఆయనతో ఉన్నంతసేపు తానుకూడా చిన్నపిల్లనై పోతానని, ఈ జనరేషన్ కు చదువు మాత్రమే కాదు కుటుంబ విలువలను తప్పకుండా నేర్పాలని చెబుతుంటారని చెప్పింది. మొత్తానికి ఈ యేడాదితో 52వ పుట్టిన రోజు జరపుకుంటున్న టార్చ్ బేరర్ కు పెద్ద ఎత్తున్న శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. #birthday #trivikram-srinivas #special-article #trivikram-srinivas-birthday మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి