Assault Case : తెలంగాణ (Telangana) లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొల చింతపల్లి గ్రామంలో 27 ఏళ్ల చెంచు గిరిజన మహిళ (Tribal Woman) ను కిడ్నాప్ చేసి, 12 రోజుల పాటు ఇంట్లో బందించి చిత్ర హింసలకు గురి చేశారు సొంత కుటుంబ సభ్యులు. ఇంట్లో నుండి పారిపోకుండా ఆమె బట్టలు తొలిగించి బంధించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ కుటుంబం తమ భూమిని నిందితుల్లో ఒకరైన కౌలు రైతు బండి వెంకటేష్‌కు కౌలుకు ఇచ్చారు. అదే పొలంలో బాధిత మహిళ, ఆమె భర్త పొలంలో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా, బాధిత పని చేయడానికి నిరాకరించింది, పని చేయమని ఒత్తిడి చేయడంతో, ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేష్ ఆమె కోసం వెతికాడు.
సమీపంలోని గ్రామంలో ఆమెను గుర్తించిన తర్వాత, అతను ఆమెను తిరిగి గ్రామానికి తీసుకువచ్చి ఒక గదిలో బంధించాడు. వెంకటేష్, అతని భార్య శివమ్మ, ఆమె అక్క, ఆమె భర్త ఆమెను చిత్రహింసలకు గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై లైంగిక వేధింపులకు (Abducted Tortured) పాల్పడడం, మహిళ పట్ల అసభ్యత, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Also Read : ప్రభుత్వాలు మారితే నిర్మాణాలు కూల్చివేయడమేనా !