Accident:అనంతపురంలో బస్ బ్రేక్ ఫెయిల్..ఒకరు మృతి

అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేగంగా దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

New Update
Accident:అనంతపురంలో బస్ బ్రేక్ ఫెయిల్..ఒకరు మృతి

అనంతపురంలో రాత్రి జరిగిన ఘటన అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. వేంగా వెళుతున్న బస్సు ఒక్క సారిగా అదుపు తప్పడంతో ప్రాణాపాయం సంభవించింది. కలెక్టరేట్ వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేక్ వేసే ప్రయత్నం చేసారు డ్రైవర్. కానీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో బస్సు చాలా వేగంగా దూసుకెళ్లింది. దీనివల్ల బస్సులో ఎవ్వరికీ ఏమీ అవ్వలేదు కానీ రోడ్డు మీద వెళుతన్న వాహనాదారుల్లో ఒకరి మృతికి కారణం అయింది. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయిన విషయాన్ని గమనించని ఇద్దరు వాహనదారులు యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో బస్సు కిందికి దూరారు.దీంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందారు.మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

Also Read:ముందు అవమానం.. తర్వాత స్థానం.. రాములమ్మ, రఘునందన్‌కు స్టార్ క్యాంపెయినర్లగా చోటు!

స్థానికంగా జరిగిన ఈ ఘటనతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏం జరుగుతోందో తెలిసే లోపు యాక్సిడెంట్ అయిపోవడం వలన అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ కు ఒక కాలికి ఒక చేతికి పెరాల్సిస్ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు హిందూపురం ఆర్టీసీ డిపోకు చెందినది.బస్ నంబర్- ap02z0499.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు