World Lung Cancer Day: సిగరేట్ తాగకపోయినా...లంగ్ క్యాన్సర్! ఊపిరితిత్తుల క్యాన్సర్ భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. మొత్తం క్యాన్సర్ కేసులలో ఈ లంగ్ క్యాన్సర్ల పర్సెంటేజ్ 6 నుంచి 8శాతంగా ఉంది. దేశంలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా భారత్‌లో 63 వేల 475 మంది చనిపోతున్నారు. By Bhavana 01 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి World అతని పేరు వరుణ్.. ఆఫీస్ టైమ్‌లో వర్క్ చేస్తూ మధ్యమధ్యలో సిగరేట్ తాగడం అతని అలవాటు.. చాయ్ తాగుతూ సిగరేట్ ఊదుతూ రిలాక్స్ అవుతున్నా అని హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు.. ఇలా డైలీ ఓ పెట్టే తాగేసే వరుణ్‌కు 35ఏళ్లు కూడా నిండకముందే లంగ్ క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆయన జీవితానికి ఎండ్‌కార్డ్ పడింది. ఇలాంటి వరుణ్ కథలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతీచోటా కనిపిస్తాయి. లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం స్మోకింగే.. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది సిగరేట్లు తాగుతుంటారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి స్థానిక డాక్టర్ల వరకు లంగ్ క్యాన్సర్ గురించి ఎంత అవగాహన కల్పిస్తోన్న చాలామందిలో మార్పు రావడం లేదు. ఇక ప్రతీ ఏడాది ఆగస్టు 1న ప్రపంచ లంగ్ క్యాన్సర్ డేను జరుపుకుంటారు. లంగ్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఊపిరితిత్తుల క్యాన్సర్ భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. మొత్తం క్యాన్సర్ కేసులలో ఈ లంగ్ క్యాన్సర్ల పర్సెంటేజ్ 6 నుంచి 8శాతంగా ఉంది. దేశంలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం. ఈ క్యాన్సర్ కారణంగా ఏటా భారత్‌లో 63 వేల 475 మంది చనిపోతున్నారు. 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు వారు ఎక్కువగా ఈ క్యాన్సర్ బారినపడుతున్నారు. వీరిలో పురుషులతో పాటు మహిళలూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. లంగ్ క్యాన్సర్ బారిన పడే ప్రతీ నలుగురిలో ముగ్గురు పురుషులు ఉంటుండగా.. ఒక మహిళ ఉంటోంది. ధూమపానం కారణంగా ఎక్కువగా లంగ్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇతర కారణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన వారితో పోలిస్తే, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే వ్యక్తులు.. మరణించే అవకాశం 15 నుంచి 30 శాతం ఎక్కువ. సిగరెట్ తాగేవారు కూడా రకరకాలు ఉంటారు, కొంతమంది చైన్ స్మోకర్స్, మరికొందరు రోజుకు ఒకటి, రెండు సిగరెట్లు తాగుతారు. ఈ తీవ్రత బట్టి, క్యాన్సర్ తీవ్రత ఆధారపడి ఉంటుంది. లంగ్ క్యాన్సర్ ఉందని నిర్ధరణ అయిన తర్వాత, స్మోకింగ్ పూర్తిగా మానేసిన వ్యక్తులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటు పొగ తాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడతారు. వాయు కాలుష్యం, గనులు, కర్మాగారాల్లో పనిచేసేవారి లంగ్స్ త్వరగా పాడవుతాయి. ఇక రాడాన్ వాయువుకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ కావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణం. ఈ వాయువు సాధారణంగా రాళ్ళు, ఇసుక, మట్టి, మండే బొగ్గు, శిలాజ ఇంధనాల నుంచి వస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఇది కూడా ముఖ్య కారకం! Also read: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం #lung-cancer #world-lung-cancer-day #smoking మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి