దక్షిణ మధ్య రైల్వే (South Central Railway), విజయవాడ డివిజన్ అధికారులు కీలక ప్రకటన చేశారు. ట్రాఫిక్ బ్లాక్, నిర్వహణ పనుల కారణంగా 24 రైళ్లను రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు మరో 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరో 6 రైళ్లను దారి మళ్లిస్తున్నామన్నారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు. రద్దైన రైళ్ల జాబితాలో విజయవాడ-తెనాలి, విజయవాడ-ఒంగోలు, గూడురు - విజయవాడ, విశాఖపట్నం - గుంటూరు, విశాఖపట్నం - విజయవాడ, విశాఖపట్నం - మచిలీపట్నం, రాజమండ్రి - విజయవాడ తదితర రైళ్లు ఉన్నాయి. పూర్తి వివరాలను కింది ట్వీట్ లో చూడొచ్చు.
ఇది కూడా చదవండి: Indian Railways: ఆ 4 రైళ్లు ఇక కాజీపేట, కర్నూల్, బోధన్ వరకు.. అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే.. రేపటి నుంచే..
ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతికి రాకపోకలు సాగించే కృష్ణా ఎక్స్ ప్రెస్ ను సైతం అధికారులు రద్దు చేశారు. కృష్ణా జిల్లా బాపట్ల వద్ద ట్రాక్ పనులు జరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: MMTS: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లు.. ఏ రూట్లలో అంటే?
ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్ ప్రెస్(17406)ను ఈనెల 8, 9, 10వ తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇంకా.. తిరుపతి- ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ ప్రెస్ (17405) ట్రైన్ ను ఈనెల 7, 8 9వ తేదీల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.