Trains Cancelled: తెగిపోయిన రైల్వేలైన్.. తెలంగాణ, ఏపీ మధ్య ఆ రైళ్లన్నీ రద్దు!

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మహబూబాబాద్ సమీపంలోని అమోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది.దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.

Trains Cancelled: తెగిపోయిన రైల్వేలైన్.. తెలంగాణ, ఏపీ మధ్య ఆ రైళ్లన్నీ రద్దు!
New Update

Trains Cancelled:  తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాలు చెరువుల్లాగా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మహబూబాబాద్ సమీపంలోని అమోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో ఒక్కసారిగా ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.

అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇంటికన్నె- కేసముద్రం మార్గంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువ, దిగువ రైలు మార్గాల్లో కంకర రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు సైతం పక్కకు ఒరిగాయి. దీంతో విజయవాడ – కాజీపేట లైన్‌ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే మహబూబాబాద్ శివారులోనూ రైలు పట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది.

ఈ నేపథ్యంలో సమీప రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. కాగా, మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో మచిలీపట్నం, సింహపురి ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. అలాగే పలు రైళ్లను దారి మళ్లించారు. అదే విధంగా మంగనూరు ఎక్స్ ప్రెస్ ను కాజీపేటలో నిలిపివేశారు. ఇక, ఎంటీఎం నుంచి వయా సికింద్రాబాద్, బీదర్ వెళ్లాల్సిన రైలును మహబూబాబాద్‌లో ఆగిపోయింది.

అలాగే తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ కు వరద తాకింది. దీంతో పందిళ్లపల్లి వద్ద మహబూబ్ నగర్ – విశాఖ ఎక్స్ ప్రెస్ సుమారు 4 గంటల వరకు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

#mahabubnagar #telangana #track #trains-cancelled #secndrabad #vijyawada
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe