విజయనగరం రైలు ప్రమాదం చాలా ట్రైన్స్ రాకపోకలను అడ్డుకుంది. ఈ దారిలో వెళ్ళే రైళ్ళను కొన్నింటిని పైర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. మరి కొన్నింటిని దారి మళ్ళించారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ ( 17016)ను సత్తెనపల్లిలో నిలిపేశారు. సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12704)ను నల్లపాడు రైల్వేస్టేషన్‌లో ఆగిపోయింది. రూట్ ఎప్పటికి క్లియర్ అవుతుందో స్పష్టమైన సమాచారం తెలియకపోవడంతో నల్లపాడు, సత్తెనపల్లి స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అక్కడ అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేవారు. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఆహారం, నీరు సదుపాయాలను కల్పిస్తున్నారు.
Also Read:విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
ఇక విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు మీదుగా భువనేశ్వర్, హౌరా వైపు వెళ్లాల్సిన రైళ్ళను ఎక్కడికక్కడ నిలిపివేశారు. హిరాకండ్, భువనేశ్వర్, నాగావళి, పూరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ఆగిపోయాయి. హౌరా, భువనేశ్వర్ వైపు నుంచి విశాఖ మీదుగా నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020), ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12703), టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (18189), హౌరా-బెంగళూరు దురంతో ఎక్స్‌ప్రెస్ (12245)లను కొంతసేపు ౠపేశారు. కానీ తర్వాత వాటి దారిని మళ్ళిస్తున్నామని అధికారులు ప్రకటించారు. దీంతో ట్రైన్స్ ౠలస్యం అవుతున్నాయి కానీ పూర్తిగా ఆగిపోలేదు. రాయపూర్-విశాఖపట్నం (08527) ప్యాసింజర్‌ను రద్దు చేశారు. విశాఖపట్నం-రాయపూర్ (08528) ప్యాసింజర్ రైళ్ళను మాత్రం రద్దు చేశారు. కోర్బా-విశాఖపట్నం, పారదీప్-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం ట్రైన్స్ కూడా రద్దయ్యాయి. రాయపూర్-విశాఖ మధ్య తిరిగే 08527, 08528 ప్రస్తుతానికి, ఈరోజుకి రద్దు చేశారు. అలాగే విశాఖ-రాయగడ, విశాఖ-భువనేశ్వర్, హౌరా వైపు వెళ్లే రైళ్ళను నిలిపేశారు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి రాయగడకు బయలుదేరి వెళ్లాల్సిన రాయగడ ఎక్స్‌ప్రెస్ ను రీషెడ్యూల్ చేశారు. బరుని-కోయంబత్తూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (03357)ను దారి మళ్ళించారు.
ఇవి కాకుండా మరి కొన్ని రైళ్ళను కూడా రద్దు చేయడం లేదా దారి మళ్ళించొచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు.