/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-11-9.jpg)
గల్ఫ్ దేశమైన కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఓ భారతీయ కుటుంబం సజీవదహనం కావడం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు కువైట్‌లోని అబ్బాసియా ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి 9 గంటలకు భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు నిద్రపోయారు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమచారం మేరకు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నప్పటికీ అప్పటికే కుటుంబ మంటల్లో సజీవదహన అయ్యింది. మృతులు మాథ్యూ ములక్కల్ (40), అతని భార్య లిని అబ్రహం (38), వారి పిల్లలు ఇరిన్ (14),ఇస్సాక్ (9)గా గుర్తించారు.
Also Read: భారీ వరదలు.. వంతెన కూలి 11 మంది మృతి
వీళ్లు కేరళలోని అలప్పుజ జిల్లాలో నీరట్టుపురానికి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవలే వాళ్లు కేరళకు వచ్చి... మళ్లీ శుక్రవారమే తిరిగి కువైట్‌కు వచ్చారు. ఇంతలోనే రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆ కుటుంబం అగ్ని ప్రమాదానికి బలైపోయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. ఆ ఇంట్లో ఏసీ పవర్ ఫెయిల్యూర్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరిగినప్పుడు వాళ్లు విషపూరిత వాయువును పీల్చుకున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా.. గతనెలలో కూడా కువైట్‌లోని మగంఫ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 49 మంది మృతి చెందగా.. అందులో 45 మంది భారతీయులే మృతి చెందడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: బోటులో ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది దుర్మరణం!
Four members of a #Malayali family died in a fire accident at their residence in Abbasiya, #Kuwait.
The deceased are Mathew Muzhakkal, his wife Lini Abraham, and their children Isaac and Irene, all hailing from Thiruvalla, #Kerala.
The fire broke out in the second-floor… pic.twitter.com/AAa8K7jZqz
— South First (@TheSouthfirst) July 20, 2024