Child Died after falling into Manhole: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి 4 ఏళ్ల బాలుడు నాలాలో పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలోని ప్రగతి నగర్‌లో చోటు చేసుకుంది. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. బాలుడి జాడ తెయకపోవడంతో పాటు వర్షం పడుతుండటం, నాలాలు ఓపెన్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాల్లోని సీసీ పుటేజీని పరిశీలించారు. దీంతో బాలుడు నాలాలో పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
వెంటనే గల్లంతైన బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. బాచుపల్లిలోని రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. బాలున్ని స్థానిక ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నగరంలో భారీ వర్షం కుస్తున్న సమయంలో నాలాలు ఓపెన్ చేసి ఉంటాయని, తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని అధికారులు తెలిపారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదని, తల్లిదండ్రులు వారి పిల్లలను వెంట తీసుకెళ్లినా నిటీ గుంటలు ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
మరోవైపు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని, ఒకవేళ బయటకు వెళ్లిన వారు నాలాలను గమనిస్తుండాలని, అంతే కాకుండా తడిగా ఉన్న విద్యుత్ సంభాలను పట్టుకోవద్దని, లోతుగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకూడదని ముఖ్యంగా పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: పాపం సంఘవి జీవితాంతం ఇంతేనా.. హెల్త్ బులిటెన్‌లో షాకింగ్ విషయాలు