స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని చంటేయపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందాడు. ఆన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించడానికి తల్లితోపాటు వచ్చిన బాలుడు ఆడుకుంటూ బస్సు ముందుకు వెళ్లాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా వెళ్లడంతో బస్సుక్రింద పడ్డ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.