/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/traffic-jpg.webp)
Traffic : రాజేంద్రనగర్(Rajendra Nagar) లో నూతనంగా నిర్మించిన హైకోర్టు(High Court) భవనానికి బుధవారం భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భూమి పూజ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Rules) విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
బుధవారం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. శంషాబాద్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాఉ ఆరంఘర్ క్రాస్ రోడ్ వద్ద బహుదూర్ పురా వైపున వెళ్లానలి. చాంద్రాయణగుట్ట వైపు వాహనాలను అనుమతించరు.
శంషాబాద్ వైపు నుంచి ఓల్డ్ కర్నూల్ రోడ్డు(Old Kurnool Road) లోకి వచ్చే వాహనాలు కాటేదాన్, దుర్గానగర్, ఆరాంఘర్, జూపార్క్, మెహిదీపట్నం వైపు వెళ్లాలి.
కాటేదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలు దుర్గానగర్క్రాస్ రోడ్డులో నుంచి ఆరాంఘర్, బహదూర్పురా వైపు వెళ్లాలి. చాంద్రాయణగుట్ట వైపు అనుమతించరు. ఆరాంఘర్ జంక్షన్ వైపు అనుమతించరు.
Also Read : గోవాలో మిస్సైన మేయర్ కూతురు!