Missing : గోవాలో మిస్సైన మేయర్‌ కూతురు!

నేపాల్‌ మేయర్‌ కూతురు ఆరతి హమాల్‌ గోవాకు రాగా.. ఆమె గత సోమవారం నుంచి కనిపించడం లేదని స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న పోలీసులు భారత పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే ...ఆమె ఓషో మెడిటేషన్‌ ఫాలో అవుతుందని, దాని కోసం కొద్ది నెలలుగా ఆమె గోవాలో ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

New Update
Missing : గోవాలో మిస్సైన మేయర్‌ కూతురు!

Missing Case : నేపాల్‌(Nepal) మేయర్‌(Mayor)  కూతురు గోవా(Goa) లో మిస్‌ అయ్యారు. ఆమె మెడిటేషన్‌ కోసం నేపాల్ మేయర్‌ కూతురు కొద్ది నెలల క్రితం గోవాకి వచ్చారు. ఆమె సోమవారం రాత్రి నుంచి కనిపించడం లేదని స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న నేపాల్‌ మేయర్‌ ఈ విషయం గురించి భారత్‌ అధికారులకు సమాచారం అందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ధంగధి సిటీ మేయర్ గోపాల్ హమాల్‌ పెద్ద కుమార్తె ఆరతి హమాల్‌(Arathi Hamal)  ఓషో మెడిటేషన్‌ ఫాలో అవుతుందని, దాని కోసం కొద్ది నెలలుగా ఆమె గోవాలో ఉంటుందని అధికారులు వివరించారు. అయితే సోమవారం రాత్రి నుంచి ఆరతి కనిపించడం లేదని ఆమె స్నేహితురాలు ఆరతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. .

దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోపాల్‌ తెలిపారు... కుమార్తెను వెదికేందుకు ఆయన గోవా ప్రజల సాయం కోరారు. ఈ క్రమంలోనే ఆయన ఆరతి ఫోటోను సోషల్‌ మీడియా(Social Media) లో షేర్‌ చేశారు. ఆమె కనిపిస్తే వెంటనే ఆచూకీ చెప్పాలంటూ ఆయన మొబైల్‌ నెంబర్లను కూడా పోస్ట్‌ చేశారు.

ఆరతి ని వెదికేందుకు తన చిన్న కూతురు , అల్లుడు గోవాకి బయల్దేరారని గోపాల్‌ తెలిపారు. ఆరతికి సంబంధించిన ఫిర్యాదు అందిందని..ఆమె కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టినట్లు గోవా పోలీసులు తెలిపారు.

Also Read : బట్టర్‌ చికెన్ కనిపెట్టింది మేమే అంటూ కోర్టుకెక్కిన హోటల్‌ పంచాయితీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు