Traffic Rules : ఆ రూట్లో వెళ్లకండి..వేరే మార్గం చూసుకోండి!

బుధవారం నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రోజున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు

Traffic Restrictions : నేడు బక్రీద్‌..హైదరాబాద్‌ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!
New Update

Hyderabad : హైదరాబాద్ లో ఇప్పటికే పెరిగిన జనాభా, వాహనాలతో ఫుల్‌ ట్రాఫిక్‌ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ కాలం ఆ కాలం అని సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా రోడ్ల నిండా జనాలుంటుననారు. అయితే బుధవారం నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు(Traffic Restrictions) అమల్లో ఉండనున్నాయి.

ఒకవేళ తెలీక ఆ రూట్లలో వెళ్తే.. ఇక అంతే సంగతులు. శ్రీరామనవమి(Sri Rama Navami) సందర్భంగా బుధవారం రోజున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) వెల్లడించారు. రామనవమి(Rama Navami) సందర్భంగా నిర్వహించే శోభయాత్ర.. ఉదయం సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమై.. కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల మైదానంలో రాత్రి 11.30 గంటలకు ముగుస్తుందని సీపీ తెలిపారు.

publive-image

ఈ సందర్భంగా.. శోభాయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ వెల్లడించారు. రాములోరి శోభయాత్ర.. సీతారాంబాగ్ ఆలయం నుంచి రామకోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు జరుగుతుంది. బోయిగూడ కమాన్, జాలి హనుమాన్, మంగళహాట్ పీఎస్ రోడ్, పురాణాపూల్, గాంధీ విగ్రహం, ధూల్‌పేట్, చుడిబజార్, బేగంబజార్, జుమ్మేరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి, బర్తన్ బజార్, శంకర్ షేర్ హోటల్, గురుద్వారా, సిద్ధి అంబర్ బజార్, గౌలిగూడ చమన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్, కోఠీ మీదుగా సాగనుంది ఈ ప్రధాన శోభాయాత్రలో.. వివిధ పాయింట్ల వద్ద చిన్న చిన్న ఊరేగింపులు కూడా కలుస్తాయి.

Also read: శ్రీరామ నవమి అనగానే గుర్తుకు వచ్చే 5 సూపర్ హిట్ పాటలివే.. మీరూ వినేయండి!

#hyderabad #traffic #restrictions #rules
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe