Hyderabad Traffic:హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

ఈరోజు ప్రధాని మోదీ హైదరాబాద్‌లో జరగబోయే బహిరంగ సభలో పాల్గొననున్న సందర్భంగా.. పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలుచోట్ల ఈ ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని తెలిపారు.

Traffic Restrictions : నేడు బక్రీద్‌..హైదరాబాద్‌ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!
New Update

ఈరోజు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’కు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని నగర అదనపు పోలీసు కమిషనర్ సుధీర్‌ బాబు తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు..

1. పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వరకు, టివోలి ఎక్స్‌ రోడ్స్, ప్లాజా ఎక్స్‌ రోడ్ల మధ్య రహదారులు మూసివేస్తారు.

2. సికింద్రాబాద్‌ సంగీత్‌ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ వైఎంసీఏ వద్ద క్లాక్‌ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, బేగంపేట వైపు మళ్లిస్తారు.

3.బేగంపేట నుంచి సంగీత్‌ కూడలికి వచ్చే వాహనాలను సీటీఓ ఎక్స్‌ రోడ్స్‌ వద్ద బాలంరాయ్, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్‌ ఉప్‌కార్, వైఎంసీఏ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌

ఎక్స్‌ రోడ్ల వైపు పంపిస్తారు.

4. బోయినపల్లి, తాడ్‌బండ్‌ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్‌ బాండ్‌ వద్ద సీటీఓ, రాణిగంజ్, ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

5. కార్ఖానా, ఏబీఎస్‌ నుంచి ఎస్‌బీహెచ్‌-ప్యాట్ని వైపు వచ్చే ట్రాఫిక్‌ స్వీకార్‌-ఉప్‌కార్‌ వద్ద వైఎంసీఏ, క్లాక్‌ టవర్, ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్‌బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్లాలి.

6. ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్‌బీహెచ్‌- స్వీకార్‌-ఉప్‌కార్‌ వైపు అనుమతిలేదు. క్లాక్‌ టవర్, వైఎంసీఏ లేదా ప్యారడైజ్, సీటీఓ వైపు పంపిస్తారు.

7. ఆర్టీఏ కార్యాలయం (తిరుమలగిరి), కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ టివోలి వద్ద స్వీకార్‌-ఉప్‌కార్, వైఎంసీఏ లేదా బ్రూక్‌ బాండ్, బాలంరాయ్, సీటీఓ వైపు ప్రయాణించాలి.

8. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్‌ రాజ్‌భవన్‌ వైపు పంపిస్తారు.

Also Read: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన 

#telugu-news #pm-modi #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe