Traffic Restrictions : బక్రీద్ (Bakrid) సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు వివరించారు. నగరంలోని మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు వాహనాలను వేరే రూట్లకు దారి మళ్లించనున్నట్లు వివరించారు.
పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ వైపు నుంచి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా అనుమతినిస్తామని పేర్కొన్నారు. ప్రార్థనల నిమిత్తం వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని నెహ్రూ జులాజికల్ పార్క్, అల్లాహో అక్బర్ మసీదు ఎదుట ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పాతబస్తీలో పలు మార్గాల్లో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వివరించారు. దాదాపు వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసులు వివరించారు.
Also read: ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్..