Hanuman Jayanthi : హనుమాన్ శోభయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో హనుమాన్ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉదయం 11.30 AM నుంచి రాత్రి 8.00 PM గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుంది. ఏప్రిల్ 24 (బుధవారం) ఉదయం 6.00 AM గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

Hanuman Jayanthi : హనుమాన్ శోభయాత్ర.. నగరంలో ట్రాఫిక్  ఆంక్షలు
New Update

Traffic Restrictions : హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌(Hyderabad) లో హనుమాన్ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉదయం 11.30 AM గంటలకు గౌలిగూడ రామమందిరం(Ram Mandir) నుంచి హనుమాన్ శోభయాత్ర ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ వరకు ఈ యాత్ర సాగుతుంది. దీంతో ఉదయం 11.30 AM నుంచి రాత్రి 8.00 PM గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుంది.

Also Read: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి!

పుత్లీబౌలీ క్రాస్ రోడ్స్, ఆంధ్రబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, CTO జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్ తదితర ప్రాంతాల మీదుగా మొత్తం 12 కిలోమీటర్లు హనుమాన్ శోభయాత్ర సాగుతుంది. కూడళ్లలో మొత్తం 44 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్‌ పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు ముసిఉంటాయి. ఏప్రిల్ 24 (బుధవారం) ఉదయం 6.00 AM గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. హనుమాన్ శోభయాత్ర సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Also Read: మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. కేంద్రం కీలక నిర్ణయం

#hyderabad-news #ram-mandir #telugu-news #hanuman-jayanthi #traffic-restrictions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి