Kodad-Vijayawada High Way: బెజవాడ-కోదాడ హైవే బంద్‌!

భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవాహిస్తుండడంతో సూర్యాపేట- ఖమ్మం, హైదరాబాద్‌ నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను నిలిపివేశారు.

Kodad-Vijayawada High Way: బెజవాడ-కోదాడ హైవే బంద్‌!
New Update

Kodad-Vijayawada High Way: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ఉండడంతో ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో సూర్యాపేట- ఖమ్మం వాహనం మీదగా విజయవాడ వెళ్లే వాహనాలను అధికారులు నిలిపివేశారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు పంపిస్తున్నారు.అదేవిధంగా విజయవాడ నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్‌ వచ్చే వాహనాలను గుంటూరు, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి మీదుగా నడుపుతున్నారు.

ఇక ఖమ్మంలో వరదల కారణంగా సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను నిలిపివేశారు. సూర్యాపేట-ఖమ్మం బైపాస్‌ మార్గంలో లారీలు భారీగా నిలిచిపోయాయి. కాగా, సూర్యాపేట మీదగా ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితి ఎదురైతే 9010203626 అనే నెంబర్​కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.

Also Read: హమ్మయ్య.. ఖమ్మంలో ఆ 9 మంది సేఫ్!

#vijayawada #khammam #suryapet #telangana-rains #ap-rains #kodad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe