Breaking: విమానాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌..24 సర్వీసులు రద్దు..ఏం జరిగిందంటే!

చెన్నై విమానాశ్రయం లో ప్రయాణికుల లగేజీతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనతో విమానాశ్రయ అధికారులు 24 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.

Breaking: విమానాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌..24 సర్వీసులు రద్దు..ఏం జరిగిందంటే!
New Update

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో ఓ ట్రాక్టర్‌ ..విమానాన్ని ఢీకొట్టింది.దీంతో విమానం స్వల్పంగా దెబ్బతింది. దీనికి సంబంధించిన వివరాలను విమానాశ్రయాధికారులు వివరించారు. చెన్నై ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికుల లగేజ్‌ తో వెళ్తున్న ఓ ట్రాక్టర్..ఇండిగో విమానాన్ని ఢీకొట్టంది.

దీంతో అప్రమత్తమైన ఇండిగో సంస్థ అధికారులు..చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లాల్సిన 24 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకు విమాన ఛార్జీలను రీఫండ్‌ చేస్తామని అధికారులు ప్రకటించారు. బుధవారం నుంచి విమాన సర్వీసులను పునరుద్దరిస్తామని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఇండిగో విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. హెచ్చరించినప్పటికీ కూడా అతని ప్రవర్తన మార్చుకోలేదు. అంతటితో ఆగకుండా మరింతగా రెచ్చిపోయాడు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అయిన తరువాత నిందితుణ్ని పోలీసులకు అప్పగించారు.

కొన్ని నెలల క్రితం ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో తన తోటి ప్రయాణికురాలి పై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎయిర్‌ ఇండియా విమానంలో జరిగిన ఈ ఘటన మరువకముందే అలాంటిదే మరోకటి జరగింది. గువాహటి - ఢిల్లీ విమానంలో ఓ ప్రయాణికుడు తాగి వీరంగం సృష్టించాడు.

క్యాబిన్‌లో వాంతులు చేసుకోవడంతోపాటు మలవిసర్జన కూడా చేశాడు. ఈ వరుస ఘటనలతో విమానాల్లో మద్యం సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Also read: రసగుల్లా కోసం కొట్టుకున్న పెళ్లి వారు!

#accident #chennai #indigo-flight
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe