Andhra Pradesh: ఆ మంత్రే మాపై రాళ్ల దాడి చేయించాడు: కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో టీపీడీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు పార్టీ కార్యకర్తలపై ఆదివారం రాత్రి కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వైసీపీ కార్యకర్తలే చేశారని.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందని కన్నా ఆరోపించారు.

New Update
Andhra Pradesh: ఆ మంత్రే మాపై రాళ్ల దాడి చేయించాడు: కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కన్నా లక్ష్మీనారాయణ సహా మరికొంతమంది గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడి వైసీపీ కార్యకర్తలే చేశారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారని.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగిందన్న కన్నా ఆరోపించారు. గంజాయి తాగి మాపై హత్యాయత్నం చేశారని.. దేవుని దయవల్ల చిన్న గాయాలతో బయట పడ్డామని చెప్పారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. మాపై దాడికి పాల్పడ్డవారిపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also read: పూనకాలు తెప్పిస్తున్న ‘రా.. కదలి రా’ సాంగ్.. మీరు కూడా వినేయండి!

రాళ్లతో దాడులు

ఇక వివరాల్లోకి వెళ్తే.. తొండపి గ్రామంలో టీడీపీ జెండా ఆవిష్కరణతో పాటు పార్టీలో పలువురి చేరిక సందర్భంగా ఆదివారం రాత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna LaxmiNarayana) ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘బాబు ష్యూరిటీ, భవష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అయితే, ఒక్కసారిగా కొందరు దుండగులు రెచ్చిపోయి రాళ్లతో దాడికి దిగారు.

టీడీపీ ప్రజాదరణ చూసి ఓర్వలేకే

లైట్లు ఆర్పేసి బిల్డింగుల మీది నుంచి రాళ్లు విసిరారు. అయితే ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులు గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దాడి నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అటు వైపు వెళ్లకుండా వెనక్కి వచ్చి గ్రామంలోనే ఉండిపోయారు. విషయం తెలిసి గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. తమకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే అధికార పార్టీ నాయకులు ముందస్తు పథకం ప్రకారమే తమపై దాడికి దిగారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: దమ్ముంటే నాపై ఎంపీగా పోటీచెయ్‌.. 3 లక్షల మెజార్టీతో గెలుస్తా.. చంద్రబాబుకు కేశినేని నాని సవాల్‌

Advertisment
తాజా కథనాలు