హైదరాబాద్‌లోని ప్రముఖ కట్టడాల్లో ఒకటైన చార్మినార్‌ను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కానీ వారు చార్మినార్ వద్దకు వెళ్లాంటే బస్సుల్లోనో, ఆటోల్లోనే వెళ్లాల్సిందే. ఎందుకంటే పర్యాటకులు అక్కడికి తమ సొంత వాహనాలు తీసుకెళ్తే పార్కింగ్ చేయడానికి స్థలం ఉండదు. ఇది నిన్నటి వరకు. ప్రస్తుతం ప్రయాణికులకు వాహనాల పార్కింగ్ సమస్య తగ్గింది. టూరిస్ట్‌ల వాహనాలకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఒక్క చోట కాదు రెండు చోట్ల కాదు చార్మినార్‌కు నలు దిక్కుల నుంచి వచ్చే వారికి ఛార్మినార్ చుట్టు పక్కల ప్రాంతాల్లో స్థలాన్ని కేటాయించినట్లు తెలిపింది.
టూరిస్టులు తమ వాహనలను తత్కాలికంగా చార్మినార్ బస్ డిపో దగ్గర పార్కింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. పార్కింగ్ సౌకర్యం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టి ఉంచుకున్న ప్రభుత్వం.. ఫ్రేమ్‌వర్క్‌పై పబ్లిక్ ప్రైవేట్ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికోసం బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సంస్థ ప్రకటించింది. ఈ నెల 16న ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. పార్కింగ్ కోసం ఏర్పాటు చేయబోయే మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌కు సమారు 3,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దాదాపు నాలుగు బేస్ మెంట్ స్థాయిలో మూడు ఫ్లోర్లలో దీనిని నిర్మించబోతున్నట్లు తెలిపింది.
ఇందులో దాదాపు 200 కార్లు, బైక్‌లు పార్కింగ్ చేసుకునే విధంగా దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పాతబస్తీ డెవలప్ మెంట్‌కు సంబంధించి ప్రాథమిక ఏజెన్సీగా పనిచేస్తున్న సంస్థ ఈ నిర్మాణాన్ని నాలుగు అంతస్తులుగా నిర్మించాలని భావించినట్లు తెలిపారు. దానికి అయ్యే ఖర్చుకు సంబంధించి ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణంతో పాలబస్తీలో చార్మినార్‌ను వీక్షించేందుకు వచ్చే పర్యటకులకు వాహనాల పార్కింగ్ తిప్పలు తప్పిట్లేయింది.