London : విమానంలో కొట్టుకున్న ప్యాసింజెర్లు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఈ మధ్య విమానాల్లో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి. ప్యాసెంజర్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మొరాకో నుంచి లండన్ కు వెళుతున్న విమానంలో ప్రయాణికులు కొట్టుకోవడంతో దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

London : విమానంలో కొట్టుకున్న ప్యాసింజెర్లు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
New Update

Ryanair Flight Makes Emergency Landing : విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ నెలకొనడంతో టేకాఫ్‌ అయిన అరగంటకే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ (Emergency Landing) చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ర్యాన్‌ఎయిర్ విమానం (Ryanair Flight) బుధవారం మొరాకో (Morocco) లోని అగాదిర్‌ నుంచి లండన్‌ (London) కు బయల్దేరింది. ఫ్లైట్‌లో ఒక వ్యక్తి తన భార్యాపిల్లలతో కలసి వచ్చి ఓ మహిళా ప్రయాణికురాలిని సీటు ఇవ్వాల్సిందని కోరాడు. దానికి ఆమె ఒప్పుకోపోవడంతో అతను బెదిరించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ మహిళ భర్త అతడిని వారించడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అక్కడితో ఆగకుండా గొడవు దారి తీసింది.

ఇద్దరు ప్రయాణికులు ఒకరినొకరు తిట్టుకున్నారు. దాంతో పాటూ కొట్టుకోవడానికి రెడీ అయ్యారు. దీంతో మిగతా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. విమాన సిబ్బంది ఎత వారిస్తున్నా ఇద్దరూ ఆగలేదు. దీంతో పైలట్లు ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 36 నిమిషాల పాటూ ఫ్లైట్ అంతా అల్లకల్లోలం అయిపోయిందని మిగతా ప్రయాణికులు చెప్పారు. పిల్లలు భయంతో ఏడుస్తూనే ఉన్నారని తెలిపారు.

Also Read:Singapore: ఆ పురుగులు తింటే ఆరోగ్యానికి మంచిదే-సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ

#emergency-landing #ryanair-flight #tourists
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe