8 సభల్లో మోదీ.. 21 సభల్లో అమిత్ షా: తెలంగాణను చుట్టేసిన బీజేపీ అగ్రనేతలు

తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వాన్ని మొత్తం ప్రచారంలో మోహరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పర్యటన సహా ప్రధాని మోదీ మొత్తం 8 సభల్లో పాల్గొనగా, అమిత్ షా 21 సభల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడు నడ్డా 12 సభల్లో ప్రసంగించారు.

8 సభల్లో మోదీ.. 21 సభల్లో అమిత్ షా: తెలంగాణను చుట్టేసిన బీజేపీ అగ్రనేతలు
New Update

Telangana Elections 2023: ఎన్నికల నేపథ్యంలో కమల దళమంతా తెలంగాణలోనే మోహరించింది. నిన్నమొన్నటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా కలియదిరిగిన ప్రధాని మోదీ (Narendra Modi) సోమవారం ఢిల్లీ వెళ్లగా, అగ్రనేతలు చాలా మంది మంగళవారం కూడా రాష్ట్రంలో పర్యటించారు. ప్రధాని, అగ్రనేతల విస్తృత పర్యటనలతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లాయి. ఏ చిన్న అవకాశాన్నీ ఈ దశలో వదులుకోవద్దని భావించిన అధినాయకులు పార్టీకి పట్టున్న అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. చివరి అంకంలో విస్తృతంగా ప్రచారం జరిపారు.

ఇది కూడా చదవండి: బీజేపీ గెలిస్తే ఆయనే సీఎం.. మందకృష్ణ మాదిగ సంచలన ప్రకటన

హైదరాబాద్ (Hyderabad) పర్యటన, మాదిగ విశ్వరూప మహాసభ సహా మొత్తంగా 8 సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తన ప్రచారంలో చివరిరోజు నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. రెండు కి.మీ. మేర సాగిన రోడ్ షోకు వేలాదిగా జనం తరలివచ్చారు. బీసీ ఆత్మగౌరవ సభ కూడా విజయవంతమవడం ఆ పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపింది. కామారెడ్డి, మహేశ్వరం, తూప్రాన్, నిర్మల్, మహబూబాబాద్, కరీంనగర్ లోనూ ప్రధాని భారీ సభలు తలపెట్టారు.

  • పార్టీ జాతీయాధ్యక్షుడు జె.పి. నడ్డా (J.P. Nadda) 12 సభలకు హాజరై ప్రసంగించారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, కూకట్పల్లి, జగిత్యాల, బాన్సువాడ, జుక్కల్, బోధన్, హుజూర్ నగర్ , చేవెళ్ల, నారాయణపేట, మల్కాజ్ గిరి, జూబ్లీహిల్స్ సభల్లో నడ్డా పాల్గొన్నారు.
  • ఇక హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో మొత్తం 21 సభల్లో పాల్గొని ఈ ఎన్నికలు తమకెంత కీలకమైనవో చాటారు. రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట, కోరుట్ల, కొల్హాపూర్, ఖైరతాబాద్, మక్తల్, ములుగు, భువనగిరి, మునుగోడు, పటాన్ చెరు, ఆర్మూర్, హుజురాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జనగామ, ఉప్పల్, నల్గొండ, వరంగల్, గద్వాల, సూర్యాపేట సభల్లో అమిత్ షా పాల్గొన్నారు. హైదరాబాద్ లో పార్టీ మేనిఫెస్టో కూడా అమిత్ షా విడుదల చేశారు.
  • వీటితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తెలంగాణలో నిర్వహించిన 8 సభల్లో పాల్గొన్నారు. సిర్పూరు, వేములవాడ, గోషామహల్, మహబూబ్ నగర్, కల్వకుర్తి, సనత్ నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ సభల్లో ఆయన ప్రసంగించారు.
  • రాజ్ నాథ్ సింగ్ మొత్తం ఆరు సభల్లో పాల్గొన్నారు. హుజూరాబాద్, మహేశ్వరం, కంటోన్మెంట్, ఆర్మూర్, మేడ్చల్, కార్వాన్ సభల్లో ప్రసంగించారు.
  • చార్మినార్, మలక్ పేట, సిర్పూర్, పరకాల, దేవరకద్ర నియోజకవర్గాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాల్గొన్నారు.
  • మరో మంత్రి నితిన్ గడ్కరీ కొల్లాపూర్, ఎల్లారెడ్డి సభలకు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: జెండా పాతాల్సిందే: తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ.. వరుస పర్యటనలతో కార్యాచరణ

వీరితో పాటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలంగాణ ప్రచారంలో భాగస్వాములయ్యారు. చివరిరోజు ప్రచారంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఆ పార్టీ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, యడ్యూరప్ప, జైరాం ఠాకూర్ పాల్గొన్నారు.

మొత్తానికి కాషాయ శిబిరానికి చెందిన జాతీయ నాయకత్వం దాదాపు మొత్తంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది. మరి వారు తమ ఎన్నికల ప్రణాళికను, హామీలను ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారో, వారి కార్యాచరణ ఎంతవరకూ విజయవంతమవుతుందో ఫలితాల రోజునే తెలుస్తుంది.

#yogi-adityanath #amith-shah #narendra-modi #telangana-elections-2023 #bjp-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి