Layoffs : ఉద్యోగులకు షాకిచ్చిన ప్రముఖ కంపెనీ.. 4 వేల మంది ఔట్! ప్రస్తుతం లేఆఫ్స్ ల కాలం నడుస్తోంది. ప్రైవేట్ రంగంలో ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. తాజాగా తొషిబా సంస్థ 4 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. By Nikhil 16 May 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Toshiba : ప్రస్తుతం లేఆఫ్స్ ల(Layoffs) కాలం నడుస్తోంది. ప్రైవేట్ రంగం(Private Field) లో ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా తోషిబా సంస్థ దేశీయ ఉద్యోగుల సంఖ్యను 4 వేలు తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. తోషిబా యొక్క కొత్త యజమాని, జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్(JIP) నేతృత్వంలోని కన్సార్టియం ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వివరించింది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ వివరాలను వెల్లడించింది. తోషిబా కంపెనీని JIP డిసెంబర్‌లో $13 బిలియన్లకు కొనుగోలు చేసింది. అనంతరం తోషిబాను స్టాక్ మార్కెట్(Stock Market) నుంచి తొలగించారు. కంపెనీలో దశాబ్ద కాలంగా జరిగిన స్కామ్‌లు, అంతర్గత గందరగోళాల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సంస్థ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా.. తోషిబా యొక్క ప్రధాన కార్యాలయం టోక్యో నుంచి కవాసకికి మార్చుతున్నారు. రానున్న మూడేళ్లలో 10% నిర్వహణ లాభాలను సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. Also Read : షుగర్.. హార్ట్ డిసీజ్ పేషేంట్స్ కు గుడ్ న్యూస్.. ఆ మందుల ధరలు తగ్గాయి.. #big-layoffs #toshiba #private-field మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి